Breaking News

టీమిండియాతో రెండో టెస్టు.. న్యూజిలాండ్‌కు భారీ షాక్‌

Published on Tue, 10/22/2024 - 08:53

బెంగ‌ళూరు వేదిక‌గా టీమిండియాతో జ‌రిగిన తొలి టెస్టులో ఘ‌న విజ‌యం సాధించిన న్యూజిలాండ్ జ‌ట్టు ఇప్పుడు రెండో టెస్టుకు సిద్ద‌మైంది. ఆక్టోబ‌ర్ 24 నుంచి పుణే వేదిక‌గా జ‌ర‌గ‌నున్న రెండో టెస్టులో కూడా అదే జోరును కొనసాగించి సిరీస్‌ను 2-0 తేడాతో సొంతం చేసుకోవాల‌ని కివీస్ భావిస్తోంది. 

అయితే సెకెండ్ టెస్టుకు ముందు న్యూజిలాండ్‌కు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. స్టార్ బ్యాట‌ర్‌, ప‌రిమిత ఓవ‌ర్ల కెప్టెన్ కేన్ విలియ‌మ‌న్స్ పుణే టెస్టుకు కూడా దూర‌మ‌య్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న విలియమ్సన్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. 

గత నెలలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో విలియమ్సన్‌కు తొడ కండరాలు పట్టేశాయి. అప్పటి నుంచి కేన్ మామ ఆటకు దూరంగా ఉంటున్నాడు. ప్రస్తుతం వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్న ఈ కివీ స్టార్ బ్యాటర్ శరవేగంగా కోలుకుంటున్నాడు. ఈ విషయాన్ని బ్లాక్ క్యాప్స్‌ ప్రధాన కోచ్ గ్యారీ స్టెడ్ ధ్రువీకరించాడు.

"కేన్ విలియమ్సన్ ప్రస్తుతం మా వైద్య బృ‍ందం పర్యవేక్షణలో ఉన్నాడు.  అతడు బాగానే కోలుకుంటున్నాడు. కానీ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. కేన్‌ మూడో టెస్టుకు అందుబాటులో ఉంటాడని ఆశిస్తున్నాను" అని స్టెడ్ ఓ ప్రకటనలో పేర్కొన్నాడు. ఇక కివీస్‌ తొలి టెస్టులో ఆడిన జట్టునే పుణే టెస్టుకూ కొనసాగించే ఛాన్స్‌ ఉంది.
చదవండి: IND vs NZ: తండ్రైన టీమిండియా స్టార్ క్రికెట‌ర్‌

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)