Breaking News

44వ శతకం నమోదు చేసిన కేన్‌ విలియమ్సన్‌

Published on Wed, 07/23/2025 - 19:36

న్యూజిలాండ్‌ స్టార్‌ బ్యాటర్‌ కేన్‌ విలియమ్సన్‌ ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇంగ్లండ్‌ కౌంటీ ఛాంపియన్‌షిప్‌-2 పోటీల్లో భాగంగా నార్తంప్టన్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కేన్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌తో మిడిల్‌సెక్స్‌ తరఫున అరంగేట్రం చేసిన కేన్‌.. తన తొలి మ్యాచ్‌లోనే శతక్కొట్టి తన క్లాస్‌ను నిరూపించుకున్నాడు. 147 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన కేన్‌.. మొత్తంగా 159 బంతులు ఎదుర్కొని 14 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 114 పరుగులు చేసి ఔటయ్యాడు.

ఈ మ్యాచ్‌లో కేన్‌తో పాటు మ్యాక్స్‌ హోల్డన్‌ (151) కూడా సెంచరీ సాధించడంతో తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న మిడిల్‌సెక్స్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. రెండో రోజు రెండో సెషన్‌ సమయానికి ఆ జట్టు 129 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 546 పరుగులు చేసింది. కెప్టెన్‌ లూస్‌ డు ప్లూయ్‌ (69), జాక్‌ క్రాక్‌నెల్‌ (67) క్రీజ్‌లో ఉన్నారు. మిడిల్‌సెక్స్‌ ఇన్నింగ్స్‌లో సామ్‌ రాబ్సన్‌ (57) కూడా అర్ద సెంచరీతో రాణించగా.. ర్యాన్‌ హిగ్గిన్స్‌ 35 పరుగులు చేశాడు. బెన్‌ గెడ్డెస్‌ డకౌటయ్యాడు.

నార్తంప్టన్‌షైర్‌ బౌలర్లలో బెన్‌ సాండర్సన్‌, సైఫ్‌ జైబ్‌ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. లియామ్‌ గుథ్రీ ఓ వికెట్‌ దక్కించుకున్నాడు. నార్తంప్టన్‌షైర్‌కు ఆడుతున్న భారత స్టార్‌ స్పిన్నర్‌ యుజ్వేంద్ర చహల్‌ ఈ మ్యాచ్‌లో ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. 36 ఓవర్లు వేసి ఏకంగా 144 పరుగులు సమర్పించుకున్నాడు. 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)