Breaking News

అన్నా.. నీవు ఇప్ప‌టికి మారలేదా? పాక్ ఆట‌గాడిపై సెటైర్‌లు

Published on Sat, 07/19/2025 - 14:58

వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2025 (WCL 2025) టోర్నమెంట్‌ను పాకిస్తాన్ ఛాంపియ‌న్స్ విజ‌యంతో ఆరంభించింది. శుక్ర‌వారం ఇంగ్లండ్ ఛాంపియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 5 ప‌రుగుల తేడాతో పాక్ గెలుపొందింది. అయితే ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ విజ‌యం సాధించిన‌ప్ప‌టికి.. ఆ జ‌ట్టు వికెట్ కీపర్ క‌మ్రాన్ ఆక్మ‌ల్ మాత్రం తీవ్ర నిరాశ‌ప‌రిచాడు.

తొలుత బ్యాటింగ్‌లో కేవ‌లం 8 ప‌రుగులు మాత్ర‌మే చేసిన ఆక్మ‌ల్‌.. అనంత‌రం ఫీల్డింగ్‌లో గ‌ల్లీ స్ధాయి వికెట్ కీప‌ర్‌ను త‌ల‌పించాడు. షోయ‌బ్ మాలిక్ బౌలింగ్‌లో ఆక్మ‌ల్‌ ఈజీ స్టంపింగ్‌ను మిస్ చేసి న‌వ్వులు పాల‌య్యాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ఆరో ఓవ‌ర్ వేసిన షోయ‌బ్ మాలిక్‌.. ఇంగ్లండ్ బ్యాట‌ర్ ఫిల్ మ‌స్ట‌ర్డ్‌కు ఫుల్ ఔట్‌సైడ్ ఆఫ్ డెలివ‌రీగా సంధించాడు.

ఆ బంతిని మ‌స్ట‌ర్డ్ ఫ్రంట్ ఫుట్‌కు వ‌చ్చి డిఫెన్స్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి పిచ్ అయిన‌ వెంటనే ష‌ర్ఫ్‌గా ట‌ర్న్ అవుతూ వికెట్ కీప‌ర్ చేతికి వెళ్లింది. నేరుగా చేతి లోకి వెళ్లిన బంతిని అందుకోలేక స్టంప్ ఔట్ చేసే అవ‌కాశాన్ని క‌మ్రాన్ కోల్పోయాడు.

దీంతో 23 ప‌రుగుల దగ్గ‌ర ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న మ‌స్ట‌ర్డ్ ఏకంగా హాఫ్ సెంచ‌రీ బాదేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. దీంతో నెటిజ‌న్లు నీవు అన్నా.. నీవు ఇప్ప‌టికి ఇంకా మారలేదా? అంటూ ట్రోలు చేస్తున్నారు. 

కాగా ఆక్మ‌ల్ అంత‌ర్జాతీయ క్రికెట్ ఆడే స‌మ‌యంలో కూడా ఇటువంటి వికెట్ కీపింగ్‌తో చాలా మ్యాచ్‌ల్లో పాక్ కొంప‌ముంచాడు. 2011 వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో న్యూజిలాండ్ స్టార్ ప్లేయ‌ర్ రాస్ టేల‌ర్ ఇచ్చిన ఈజీక్యాచ్‌ను జార‌విడిచిన ఆక్మ‌ల్‌.. పాక్ ఓట‌మికి కార‌ణ‌మ‌య్యాడు. ఆ మ్యాచ్‌లో ఆరంభంలో ఔట‌య్యే ప్ర‌మాదం నుంచి త‌ప్పించుకున్న టేల‌ర్‌.. ఏకంగా సెంచ‌రీతో చెల‌రేగాడు. ప్రస్తుత మ్యాచ్‌లో పాక్‌ గెలవకపోయింటే అందుకు ఆక్మల్‌ కారణమయ్యేవాడు.
చదవండి: ODI WC 2011: యువీని సెలక్ట్‌ చేద్దామా?.. ధోని నిర్ణయం మాత్రం అదే!


 

 

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)