మూడో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ శ్రీలంక సొంతం

Published on Sun, 09/07/2025 - 21:06

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన సిరీస్‌ డిసైడర్ మూడో టీ20లో శ్రీలంక సత్తాచాటింది. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య జింబాబ్వేను 8 వికెట్ల తేడాతో లంక చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో సొంతం చేసుకుంది. ఈ మూడో టీ20లో తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

టి మారుమణి(51) టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. రజా(28), బర్ల్‌(18), సీన్‌ విలియమ్స్‌(23), ముసెకివా(18) రాణించారు. శ్రీలంక బౌలర్లలో దుషాన్‌ హేమంత మూడు వికెట్లు పడగొట్టగా.. చమీరా రెండు, పతిరాన, ఫెర్నాండో తలా వికెట్‌ సాధించారు.

కమిల్‌ మిశ్రా విధ్వంసం..
అనంతరం 192 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 17.4 ఓవర్లలో చేధించింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు కుశాల్‌ మెండిస్‌(33), ఫాథుమ్‌ నిస్సాంక(30) 57 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఆ తర్వాత యువ ఆటగాడు కమిల్‌ మిశ్రా(43 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 73 నాటౌట్‌) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. అతడితో పాటు కుశాల్‌ పెరీరా(26 బంతుల్లో 46) బ్యాట్‌ ఝూలిపించాడు. జింబాబ్వే బౌలర్లలో రజా, ముజర్బానీ తలా వికెట్‌ సాధించారు. కాగా రెండో టీ20లో శ్రీలంక అనూహ్య ఓటమి పాలైన సంగతి తెలిసిందే.
చదవండి: SA vs ENG: ఇంగ్లండ్ బ్యాటర్ల విధ్వంసం.. వన్డేల్లో భారీ స్కోర్‌! భార‌త్ రికార్డు స‌మం

 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)