ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. సౌతాఫ్రికాకు భారీ షాక్‌

Published on Tue, 08/19/2025 - 10:37

ఆస్ట్రేలియాతో మూడు వ‌న్డేల సిరీస్‌కు ముందు సౌతాఫ్రికాకు భారీ షాక్ త‌గిలింది. ఆ జ‌ట్టు స్టార్ పేస‌ర్ క‌గిసో ర‌బాడ గాయంతో కార‌ణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూర‌మయ్యాడు. ఈ విష‌యాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ధ్రువీక‌రించింది
31 ఏళ్ల కగిసో ర‌బాడ కూడి చీల‌మండ గాయం కార‌ణంగా ఆస్ట్రేలియాతో వ‌న్డే సిరీస్ నుంచి త‌ప్ప‌కొన్నాడు. 

ర‌బాడ‌కు సోమ‌వారం(ఆగ‌స్టు 18) స్కాన్ చేయించాము. కుడి చీలమండలో స‌మ‌స్య ఉన్న‌ట్లు తేలింది. ఈ క్ర‌మంలో అత‌డికి విశ్రాంతి ఇవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అత‌డు జట్టుతో పాటు ఆస్ట్రేలియాలో ఉండి ప్రోటీస్ వైద్య సిబ్బంది పర్యవేక్షణలో పునరావాసం పొంద‌నున్నాడు అని క్రికెట్ సౌతాఫ్రికా ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. 

అత‌డి స్ధానాన్ని యువ ఫాస్ట్ బౌల‌ర్ క్వేనా మ‌ఫాకాను సెల‌క్ట‌ర్లు భ‌ర్తీ చేశారు. ఆసీస్‌తో టీ20 సిరీస్‌ను ప్రోటీస్ కోల్పోయిన‌ప్ప‌టికి మ‌ఫాకా మాత్రం త‌న సంచ‌ల‌న ప్ర‌ద‌ర్శ‌న‌తో అంద‌రిని ఆక‌ట్టుకున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో మ‌ఫాకా(9) లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచారు.

ఈ క్ర‌మంలో సెల‌క్ట‌ర్లు అత‌డికి మ‌రోసారి ఛాన్స్ ఇచ్చారు. క్వెనా మఫాకా గతేడాది పాకిస్తాన్‌తో చివరగా వన్డే మ్యాచ్‌ ఆడాడు. కాగా ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కోల్పోయిన సౌతాఫ్రికా.. వన్డే సిరీస్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి వన్డే కెయిర్న్స్ వేదికగా మంగళవారం జరగనుంది.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు
టెంబా బావుమా (కెప్టెన్‌), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రీ బర్గర్, టోనీ డి జోర్జి, ఐడెన్ మార్క్రమ్‌, క్వెనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లువాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబడ, రియాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌, ప్రనెలన్‌ సబ్రాయన్‌.

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌కు ఆస్ట్రేలియా జట్టు
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ కారీ, కూపర్ కొన్నోలీ, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, ఆరోన్ హార్డీ, జోష్ హాజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మార్నస్ లబుషేన్‌, ఆడమ్ జంపా.
చదవండి: Asia Cup 2025: 'ఏ జట్టునైనా ఓడిస్తాము.. ఆసియాకప్ టైటిల్ మాదే'

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)