Breaking News

Rahane Birthday: ఐపీఎల్‌ 2023తో బజ్‌ గేమ్‌ మొదలుపెట్టిన రహానే

Published on Tue, 06/06/2023 - 17:38

టీమిండియా వెటరన్‌ బ్యాటర్‌ అజింక్య రహానే ఇవాళ (జూన్‌ 6) 35వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా బీసీసీఐ అతనికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. టీమిండియాకు రహానే కాంట్రిబ్యూషన్‌ను అంకెల రూపంలో (192 అంతర్జాతీయ మ్యాచ్‌లు, 8268 పరుగులు, 15 సెంచరీలు) తెలియజేస్తూ ఓ ట్వీట్‌ చేసిం‍ది. 

అంతర్జాతీయ క్రికెట్‌లోకి జింక్స్‌ రీఎంట్రీ..
వయసు పైబడటం, ఆటలో వేగం లేకపోవడం, ఫామ్‌ కోల్పోవడం, యువ ఆటగాళ్ల ఎంట్రీతో అవకాశాలు రాకపోవడం వంటి వివిధ కారణాల చేత దాదాపుగా రిటైర్మెంట్ ప్రకటించే స్టేజ్‌ వరకు వెళ్లిన జింక్స్‌ (రహానే ముద్దు పేరు).. ఐపీఎల్‌-2023తో అనూహ్యంగా ఫ్రేమ్‌లోకి వచ్చాడు. ఎవరో గాయపడటంతో సీఎస్‌కేలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబైకర్‌.. అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని, ఏకంగా టీమిండియా టెస్ట్‌ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. 

అంతే కాకుండా కేఎల్‌ రాహుల్‌ గాయపడటంతో డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత తుది జట్టులో కూడా చోటు కన్ఫర్మ్‌ చేసుకున్నాడు. 2022 జనవరిలో సౌతాఫ్రికాలో తన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన జింక్స్‌.. దాదాపు ఏడాదిన్నర తర్వాత టీమిండియాలోకి పునరాగమనం చేయనున్నాడు.

ఐపీఎల్‌ 2023లో రహానే 2.0..
ఐపీఎల్‌ 2023లో ఆడే అవకాశాన్ని అనూహ్య పరిణామాల మధ్య దక్కించుకున్న జింక్స్‌.. ఈ సీజన్‌లో తనలోని కొత్త యాంగిల్‌ను ప్రేక్షకులకు పరిచయం చేశాడు. రహానే 2.0గా ఫ్యాన్స్‌ను మెప్పించాడు. జిడ్డు బ్యాటర్‌ అన్న అపవాదును చెరిపివేస్తూ.. మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంతో పాటు తన జట్టులో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.

ఈ సీజన్‌ మొత్తం ఎదురుదాడే లక్ష్యంగా బరిలోకి దిగిన జింక్స్‌.. 11 ఇన్నింగ్స్‌ల్లో 172.49 స్ట్రయిక్‌రేట్‌తో​ 2 అర్ధసెంచరీల సాయంతో 326 పరుగులు చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగానే అతను టెస్ట్‌ జట్టులో చోటు కొట్టేశాడు. ఐపీఎల్‌ 2023తో బజ్‌ గేమ్‌ మొదలెట్టిన రహానే ఇదే ప్రదర్శనను డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

చదవండి: WTC Final: రోహిత్‌ శర్మకు గాయం..? టీమిండియా అభిమానుల ఆందోళన

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)