Breaking News

T20 World Cup 2024: సెమీస్‌కు చేరేది ఆ నాలుగు జట్లే.. ఆసీస్‌కు నో ఛాన్స్‌..?

Published on Wed, 06/05/2024 - 18:44

టీ20 వరల్డ్‌కప్‌ 2024పై జోస్యాల పర్వం తారాస్థాయికి చేరింది. పలనా జట్టు టైటిల్‌ గెలుస్తుంది.. పలానా జట్లు సెమీస్‌కు చేరతాయంటూ మాజీలు, విశ్లేషకులు ఊదరగొడుతున్నారు. తాజాగా ఢిఫెండింగ్‌ ఛాంపియన్‌ ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ కూడా ఈ క్రికెట్‌ జ్యోతిష్యుల సరసన చేరాడు. ఈసారి ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌, టీమిండియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్‌ జట్లు సెమీస్‌కు చేరతాయని అభిప్రాయపడ్డాడు. బట్లర్‌ తన అంచనాల్లో పటిష్టమైన ఆస్ట్రేలియాకు చోటివ్వకపోవడం ఆశ్చర్యకరం.

కాగా, ఇంగ్లండ్‌ నిన్న (జూన్‌ 4) జరగాల్సిన తమ తొలి మ్యాచ్‌లో స్కాట్లాండ్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్‌ వర్షం​ కారణంగా రద్దైంది. దీంతో ఇరు జట్లు చెరో పాయింట్‌ పంచుకున్నాయి. సూపర్‌-8 చేరే క్రమంలో ఇంగ్లండ్‌కు ఇది అంత శుభపరిణామం కాదు. ఇంగ్లండ్‌, స్కాట్లాండ్‌ పోటీపడుతున్న గ్రూప్‌లోనే ఆస్ట్రేలియా, నమీబియా, ఒమన్‌ జట్లు ఉన్నాయి. ఈ గ్రూప్‌లో మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ప్రస్తుతానికి ఆడిన ఒక్క మ్యాచ్‌లో (ఒమన్‌తో) గెలిచిన నమీబియా 2 పాయింట్లు ఖాతాలో కలిగి టాప్‌లో ఉంది. ఆస్ట్రేలియా తమ తొలి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, ఇవాళ జరిగే గ్రూప్‌-ఏ పోటీలో భారత్‌-ఐర్లాండ్‌ జట్లు పోటీపడనున్నాయి. న్యూయార్క్‌ వేదికగా ఈ మ్యాచ్‌ రాత్రి 8 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభంకానుంది. గ్రూప్‌-ఏలో ఇప్పటివరకు జరిగిన ఏకైక మ్యాచ్‌లో యూఎస్‌ఏ.. కెనడాపై విజయం సాధించింది. ప్రస్తుతం యూఎస్‌ఏ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉంది. ఈ గ్రూప్‌లో భారత్‌, ఐర్లాండ్‌, యూఎస్‌ఏ, కెనడాతో పాటు పాకిస్తాన్‌ ఉంది. భారత్‌.. జూన్‌ 9న చిరకాల ప్రత్యర్థి పాక్‌తో తలపడుతుంది. భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం జరుగబోయే మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా-ఒమన్‌ (6 గంటలకు).. పపువా న్యూ గినియా-ఉగాండ (5 గంటలకు) తలపడనున్నాయి. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)