సంజూ రాయల్స్‌ నుంచి వైదొలగాలనుకోవడానికి అతడే ప్రధాన కారణం..?

Published on Fri, 08/15/2025 - 11:21

ప్రస్తుతం ఐపీఎల్‌ వర్గాల్లో సంజూ శాంసన్‌ ట్రేడ్‌ డీల్‌కు సంబంధించిన చర్చలు హాట్‌హాట్‌గా నడుస్తున్నాయి. అసలు కారణాలు తెలియరానప్పటికీ సంజూ రాజస్థాన్‌ రాయల్స్‌ను వీడాలనుకుంటున్న విషయం స్పష్టమైపోయింది. రాయల్స్‌ సైతం సంజూ అభిమతాన్ని గౌరవమిస్తూ, అతన్ని వదిలేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే సీఎస్‌కేతో ట్రేడ్‌ డీల్‌ గురించి చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.

సంజూకు బదులుగా రాయల్స్‌ సీఎస్‌కే నుంచి ఇద్దరిని ఆశిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే సీఎస్‌కే యాజమాన్యం ఇందుకు సమ్మతిస్తున్నట్లు లేదు. సంజూను తాము తీసుకుంటే కేవలం క్యాష్‌ డీల్‌ మాత్రమే ఉంటుందని, తమ ఆటగాళ్లను ఎవరినీ వదిలిపెట్టుకునే ప్రసక్తే లేదని సీఎస్‌కే స్పష్టం చేసినట్లు సమాచారం.

ఈ ప్రచారాల నడుమ సంజూ రాయల్స్‌ను వీడాలనుకోవడానికి కారణమిదే అంటూ ఓ వార్త సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. సంజూ రాయల్స్‌ను వద్దనుకోవడానికి జోస్‌ బట్లర్‌ ప్రధాన కారణమన్నది ఆ వార్త సారాంశం. రాయల్స్‌ యాజమాన్యం 2025 మెగా వేలానికి ముందు బట్లర్‌ను రీటైన్‌ చేసుకోలేదు. 

ఇది సంజూకు అస్సలు మింగుడు పడలేదంట. జోస్‌ 2018-2024 వరకు రాయల్స్‌ విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషించినప్పటికీ అతన్ని రీటైన్‌ చేసుకోకపోవడం సంజూకు అస్సలు నచ్చలేదట. ఈ కారణంగానే అతను మేనేజ్‌మెంట్‌తో విభేదించినట్లు సమాచారం. 

సంజూ రాయల్స్‌ను వద్దనుకోవడానికి మరిన్ని కారణాలు కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో మొదటిది.. గత సీజన్‌లో అతని గైర్హాజరీలో (గాయం కారణంగా) వైభవ్‌ సూర్యవంశీ ఓపెనర్‌గా పాతుకుపోవడం. రెండవది.. యాజమాన్యం అతని ప్రత్యామ్నాయంగా ధృవ్‌ జురెల్‌కు ప్రాధాన్యత ఇవ్వడం. ఈ కారణాల వల్ల సంజూకు రాయల్స్‌ యాజమాన్యానికి గ్యాప్‌ పెరిగిందని తెలుస్తుంది.

తన మాట చెల్లని చోట, తన స్థానం యాజమాన్యానికి భారమైన చోట ఉండటం ఇష్టం లేకనే సంజూ రాయల్స్‌ను వీడాలని అనుకున్నాడని పలు నివేదికలు చెబుతున్నాయి. 2013లో రాయల్స్‌లో జాయిన్‌ అయిన సంజూ.. 2021 సీజన్‌ నంచి ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. సంజూ నేతృత్వంలో రాయల్స్‌ 2022 సీజన్‌లో రన్నరప్‌గా నిలిచింది. సంజూ, జోస్‌ బట్లర్‌ కలిసి రాయల్స్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించారు.

ఇంత చేసినా తన మాట చెల్లకుండా బట్లర్‌ను వదిలేయడం సంజూను చాలా బాధించినట్లు తెలుస్తుంది. బట్లర్‌ను కాదని రాయల్స్‌ యాజమాన్యం తనతో సహా యశస్వి జైస్వాల్‌, రియాన్‌ పరాగ్‌, జురెల్‌, హెట్‌మైర్‌, సందీప్‌ శర్మను అట్టిపెట్టుకుంది. రాయల్స్‌ వద్దనుకున్నా బట్లర్‌ను గుజరాత్‌ టైటాన్స్‌ వేలంలో రూ. 15.75 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది. 

Videos

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)