అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఐపీఎల్‌ దాకా అన్నీ ఇక్కడే!

Published on Sun, 05/07/2023 - 20:56

ఇంగ్లండ్‌ స్టార్‌ క్రికెటర్‌ జో రూట్‌.. ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌ 16వ సీజన్‌లో భాగంగా ఆదివారం ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌ ద్వారా జో రూట్‌ ఐపీఎల్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్నాడు. ఇక రూట్‌ బ్యాటింగ్‌కు రాకముందే  ఒక రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. అదేంటో తెలుసా.. జో రూట్‌ అంతర్జాతీయ క్రికెట్‌ అరంగేట్రం సహా ఐపీఎల్‌ డెబ్యూ కూడా భారత్‌లోనే జరగడం విశేషం.

అంతర్జాతీయ క్రికెట్‌లో జో రూట్‌ తన టెస్టు డెబ్యూను నాగ్‌పూర్‌ వేదికగా.. వన్డే డెబ్యూను రాజ్‌కోట్‌ వేదికగా.. ముంబై వేదికగా టి20ల్లో అరంగేట్రం చేశాడు. ఇక్కడ కామన్‌ పాయింట్‌ ఏంటంటే ఈ మూడు సందర్భాల్లోనూ ప్రత్యర్థి టీమిండియానే కావడం విశేషం. ఇక తాజాగా జైపూర్‌ వేదికగా ఐపీఎల్‌లో అరంగేట్రం  చేశాడు. 

ఇంతవరకు ఏ అంతర్జాతీయ క్రికెటర్‌ తన అరంగేట్రాన్ని ఈ విధంగా చూడలేదు. ఒక్క రూట్‌కు మాత్రమే ఇది సాధ్యమైంది. అందుకే క్రికెట్‌ అభిమానులు.. ''రూట్‌ పేరుకే ఇంగ్లండ్‌ ప్లేయర్‌.. కానీ అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి ఐపీఎల్‌ దాకా అన్ని అరంగేట్రంలు ఇక్కడే చేశాడు.. కాబట్టి ప్రాక్టికల్‌గా ఆలోచిస్తే రూట్‌ మనోడే'' అంటూ కామెంట్‌ చేశారు.

చదవండి: జైశ్వాల్‌ సరికొత్త చరిత్ర.. రెండో పిన్న వయస్కుడిగా రికార్డు 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)