Breaking News

బౌలర్లను భయపెట్టిన జో రూట్‌.. బౌండరీలతో వీరవిహారం

Published on Fri, 08/22/2025 - 13:43

ది హాండ్ర‌డ్ లీగ్‌-2025లో ఓవల్ ఇన్విన్సిబుల్స్ జైత్ర యాత్ర కొన‌సాగుతోంది. గురువారం లండ‌న్ వేదిక‌గా ట్రెంట్ రాకెట్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఓవ‌ల్ జ‌ట్టు ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ నిర్ణీత వంద బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 171 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. 

ట్రెంట్‌ రాకెట్స్‌ ఓపెనర్‌, ఇంగ్లండ్‌ సీనియర్‌ జో రూట్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి బంతి నుంచే ప్రత్యర్ధి బౌలర్లపై రూట్‌ విరుచుకుపడ్డాడు. కేవలం 41 బంతుల్లోనే 11 ఫోర్లు, 1 సిక్సర్‌తో 71 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.

హాండ్రడ్‌ లీగ్‌లో రూట్‌కి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం విశేషం. అతడితో పాటు రెహాన్‌ ఆహ్మద్‌(28), లిండే(25) రాణించారు. ఓవల్‌ బౌలర్లలో టామ్‌ కుర్రాన్‌, రషీద్‌ ఖాన్‌ తలా రెండు వికెట్లు పడగొట్టగా..  బెహాండ్రాఫ్‌, సౌటర్‌ తలా వికెట్‌ సాధించారు.

కాక్స్‌, కుర్రాన్‌ ఫిప్టీలు..
అనంతరం 172 పరుగుల లక్ష్యాన్ని ఓవల్‌ ఇన్విన్సిబుల్స్  కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 89 బంతుల్లో చేధించింది. జోర్డాన్‌ కాక్స్‌(32 బంతుల్లో 58 నాటౌట్‌), సామ్‌ కుర్రాన్‌(24 బంతుల్లో 54) హాఫ్‌ సెంచరీలతో మెరిశారు. ట్రెంట్‌ రాకర్స్‌ బౌలర్లలో రెహాన్‌ ఆహ్మద్‌ రెండు వికెట్లు పడగొట్టగా.. విల్లీ, శాండర్సన్‌ తలా వికెట్‌ సాధించారు.
చదవండి: Asia Cup 2025: మెగా టోర్నీకి ముందు సంజూ శాంసన్‌ కీలక నిర్ణయం!


 

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు