Breaking News

మళ్లీ అగ్రపీఠాన్ని అధిరోహించిన రూట్‌.. నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌ ఎవరంటే..?

Published on Wed, 12/18/2024 - 17:39

ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ నంబర్‌ వన్‌ స్థానంలో నిలిచాడు. రూట్‌.. తన సహచరుడు హ్యారీ బ్రూక్‌ను కిందకు దించి అగ్రపీఠాన్ని అధిరోహించాడు. గత వారం ర్యాంకింగ్స్‌లో బ్రూక్‌ నంబర్‌ వన్‌ స్థానంలో నిలువగా.. వారం తిరిగే లోపే రూట్‌ మళ్లీ అగ్రపీఠమెక్కాడు. 

ప్రస్తుతం రూట్‌ ఖాతాలో 895 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి. రూట్‌.. బ్రూక్‌ కంటే 19 రేటింగ్‌ పాయింట్లు ఎక్కువ కలిగి ఉన్నాడు. న్యూజిలాండ్‌తో తాజాగా ముగిసిన మూడో టెస్ట్‌లో రూట్‌ 32, 54 (రెండు ఇన్నింగ్స్‌ల్లో) పరుగులు చేయగా.. బ్రూక్‌ రెండు ఇన్నింగ్స్‌ల్లో దారుణంగా విఫలమయ్యాడు (0,1). 

ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ 423 పరుగుల తేడాతో ఓడినప్పటికీ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇదే మ్యాచ్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ స్టార్‌ ఆటగాడు కేన్‌ విలియమ్సన్‌ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన ఆధారంగా విలియమ్సన్‌ ర్యాంకింగ్‌ మెరుగుపడనప్పటికీ, గణనీయంగా రేటింగ్‌ పాయింట్లు పెంచుకున్నాడు. ప్రస్తుతం ర్యాంకింగ్స్‌లో కేన్‌ మూడో స్థానంలో ఉన్నాడు. కేన్‌కు రూట్‌కు మధ్య కేవలం 28 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.

నంబర్‌ వన్‌ టీ20 బౌలర్‌ ఎవరంటే..?
తాజా టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో విండీస్‌ లెఫ్ట్‌ ఆర్మ్‌ స్పిన్నర్‌ అకీల్‌ హొసేన్‌ నంబర్‌ వన్‌ స్థానానికి ఎగబాకాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టీ20లో అద్భుత గణాంకాలు (4-1-13-2) నమోదు చేయడంతో అకీల్‌ టాప్‌ ప్లేస్‌కు చేరాడు. అకీల్‌ మూడు స్థానాలు ఎగబాకి చాలాకాలంగా టాప్‌ ప్లేస్‌లో ఉన్న ఆదిల్‌ రషీద్‌కు కిందకు దించాడు. 
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)