చ‌రిత్ర సృష్టించిన జో రూట్‌.. సచిన్ రికార్డు బ్రేక్‌

Published on Sun, 06/22/2025 - 10:47

ఇంగ్లండ్ సూప‌ర్ స్టార్ జో రూట్ మ‌రో అరుదైన రికార్డును త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య టెస్టుల్లో అత్య‌ధిక‌ ప‌రుగులు చేసిన బ్యాట‌ర్‌గా రూట్ నిలిచాడు. లీడ్స్ వేదిక‌గా టీమిండియాతో జ‌రుగుతున్న తొలి టెస్టులో రూట్ ఈ ఫీట్ సాధించాడు. రూట్ ఇప్ప‌టివ‌ర‌కు ఇంగ్లండ్‌లో భార‌త్‌తో జ‌రిగిన టెస్టుల్లో 1589 ప‌రుగులు చేశాడు.

ఇంతకుముందు ఈ రికార్డు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్ పేరిట ఉండేది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై స‌చిన్ 1575 ప‌రుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో స‌చిన్ ఆల్‌టైమ్ రికార్డును జో బ్రేక్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో రూట్ త‌న మార్క్ చూపించ‌లేక‌పోయాడు. కేవ‌లం 28 ప‌రుగులు మాత్ర‌మే చేసి జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో ఔటయ్యాడు.

ఇంగ్లండ్‌లో భార‌త్ వ‌ర్సెస్ ఇంగ్లండ్ టెస్టుల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు..
👉జో రూట్ (ఇంగ్లాండ్) – 1579*
👉సచిన్ టెండూల్కర్ (భారత్‌) – 1575
👉రాహుల్ ద్రవిడ్ (భార‌త్‌) – 1376
👉అలిస్టర్ కుక్ (ఇంగ్లాండ్) – 1196
👉సునీల్ గవాస్కర్ (భార‌త్‌) – 1152
👉గ్రహం గూచ్ (ఇంగ్లాండ్) – 1134

ధీటుగా బదులిస్తున్న ఇంగ్లండ్‌..
తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌కు ఇంగ్లండ్ జట్టు ధీటుగా బదులిస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఒలీ పోప్‌ (131 బంతుల్లో 100 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా... బెన్‌ డకెట్‌ (94 బంతుల్లో 62; 9 ఫోర్లు) హాఫ్‌ సెంచరీతో రాణించాడు. 

భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే మూడు వికెట్లు సాధించాడు. మిగితా బౌలర్లంతా దారుణంగా విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్‌ స్కోరు 359/3తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన భారత్‌  113 ఓవర్లలో 471 పరుగులు చేసి ఆలౌటైంది. భారత బ్యాటర్లలో రిషబ్‌ పంత్‌,శుబ్‌మన్‌ గిల్‌, యశస్వి జైశ్వాల్‌ సెంచరీలతో మెరిశారు.
చదవండి: IND vs ENG: జ‌స్ప్రీత్ బుమ్రా అరుదైన ఘ‌న‌త‌.. ఫస్ట్‌ ఓవర్‌ కింగ్‌గా
 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)