జో రూట్ ఒంట‌రి పోరాటం.. ఇంగ్లండ్ గెలిస్తే చ‌రిత్రే!

Published on Sun, 06/21/2026 - 07:20

న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లండ్‌ పోరాడుతోంది. 463 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టపోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్‌ జో రూట్‌ (75 నాటౌట్‌) ఒంటరి పోరాటం  చేస్తున్నాడు. ఇంగ్లండ్‌ విజయానికి మరో 281 పరుగులు అవసరం కాగా.. న్యూజిలాండ్‌ విజయానికి మరో 5 వికెట్లు అవసరం. ఇప్పటికైతే గెలుపు అవకాశాలు న్యూజిలాండ్‌ వైపే ఉన్నప్పటికీ ఇంగ్లండ్‌ విజయం సాధిస్తే మాత్రం చరిత్ర సృష్టించినట్లే.

ప్ర‌స్తుతం జోర్డాన్ కాక్స్ (0) క్రీజులో ఉన్నాడు. కివీస్ బౌల‌ర్లలో కైల్ జేమీస‌న్ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. అంత‌క‌ముందు హ్యారీ బ్రూక్ (58) అర్ధ‌సెంచ‌రీతో రాణించాడు. రూట్‌, బ్రూక్ క‌లిసి నాలుగో వికెట్‌కు 97 ప‌రుగులు జోడించారు. వీరిద్ద‌రు ఉన్నంత‌సేపు మ్యాచ్ ఇంగ్లండ్ వైపే మొగ్గు చూపిన‌ప్ప‌టికీ బ్రూక్ వెనుదిర‌గ‌డం, ఆ వెంట‌నే వికెట్ కీప‌ర్ జేమ్స్ రూ కూడా ఔట్ కావ‌డంతో ఇంగ్లండ్ ఐదు వికెట్లు కోల్పోయింది. 

ఇక గెలుపు సంగ‌తి ప‌క్క‌న‌బెడితే కాక్స్  మిన‌హా మిగ‌తా అంతా టెయిలెండ‌ర్లే కావ‌డంతో రూట్ చివ‌రి వ‌ర‌కు నిలిస్తేనే ఇంగ్లండ్ క‌నీసం మ్యాచ్‌ను డ్రా చేసుకునే అవ‌కాశం ఉంటుంది. ఇక న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్‌లో 362 ప‌రుగులకు ఆలౌటైంది. హెన్రీ నికోల్స్ 121 ప‌రుగులు చేసి ఔటవ్వ‌గా, డారిల్ మిచెల్ (68), నాథన్ స్మిత్ (38) రాణించారు. 

ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో ఆర్చ‌ర్‌, మాథ్యూ ఫిష‌ర్ చెరో 3 వికెట్లు తీయ‌గా, జోష్ టంగ్ 2 వికెట్లు ప‌డ‌గొట్టాడు. తొలి టెస్టులో కివీస్ 115 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించిన ఇంగ్లండ్ మూడు టెస్టుల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది.

Read: నోరు మూసుకున్నందుకు రెడ్‌కార్డ్‌.. ఫిఫా చరిత్రలోనే తొలిసారి!

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)