Breaking News

చరిత్ర సృష్టించిన ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్

Published on Mon, 06/17/2024 - 20:51

ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్‌ బ్యాటర్‌ జో బర్న్స్‌ చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దేశాల తరఫున సెంచరీలు (ఆస్ట్రేలియా, ఇటలీ) చేసిన ఆరో ఆటగాడిగా చరిత్ర పుటల్లోకెక్కాడు. ఆస్ట్రేలియా నుంచి ఇటీవలే ఇటలీకి వలస వెళ్లిన బర్న్స్‌..  టీ20 వరల్డ్‌కప్‌ 2026 యూరోపియన్‌ క్వాలిఫయర్‌లో భాగంగా రొమేనియాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో మెరిశాడు.

ఈ మ్యాచ్‌లో 55 బంతులు ఎదుర్కొన్న బర్న్స్‌ 12 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 108 పరుగులు చేశాడు. బర్న్స్‌ శతక్కొట్టుడుతో పాటు జస్టిన్‌ మోస్కా (30 బంతుల్లో 72; 9 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్దసెంచరీతో విరుచుకుపడటంతో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇటలీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 244 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

అనంతరం 245 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన రొమేనియా 17.4 ఓవర్లలో 84 పరుగులకే చాపచుట్టేసి 160 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది.

అంతర్జాతీయ క్రికెట్‌లో రెండు దేశాల తరఫున సెంచరీలు చేసిన ఆటగాళ్లు వీరే..

కెప్లెర్‌ వెసెల్స్‌- ఆస్ట్రేలియా (5 సెంచరీలు), సౌతాఫ్రికా (2 సెంచరీలు)
ఇయాన్‌ మోర్గాన్‌- ఐర్లాండ్‌ (1), ఇంగ్లండ్‌ (15)
ఎడ్‌ జాయ్స్‌- ఐర్లాండ్‌ (5), ఇంగ్లండ్‌ (1)
గ్యారీ బ్యాలెన్స్‌- ఇంగ్లండ్‌ (4), జింబాబ్వే (1)
మార్క్‌ చాప్‌మన్‌- హాంగ్‌కాంగ్‌ (1), న్యూజిలాండ్‌ (2)
జో బర్న్స్‌- ఇంగ్లండ్‌ (4), ఇటలీ (1)

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)