Breaking News

భారత జట్టులో నో ఛాన్స్‌.. ‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌తో ఉన్నాడు’

Published on Mon, 07/10/2023 - 09:48

వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌కు కొత్త ఛైర్మన్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించిన తిలక్‌ వర్మ, యశస్వీ జైశ్వాల్‌ వంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. అయితే మరి కొంతమంది ఐపీఎల్‌ హీరోలకు మాత్రం సెలక్టర్లు మొండిచేయి చూపారు. అందులో ముందు వరుసలో ఉంటాడు పంజాబ్‌ కింగ్స్‌ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ. జితేష్‌ శర్మ ఈ ఏడాది సీజన్‌లో అదరగొట్టాడు.

లోయార్డర్‌లో బ్యాటింగ్‌కు వచ్చి జట్టుకు వెన్నెముకగా నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 156.06 స్ట్రైక్ రేట్‌తో 309 పరుగులు చేశాడు. కాగా అంతకు ముందు శ్రీలంక, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లకు  భారత జట్టులో జితేష్‌కు చోటు దక్కినప్పటికీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఇక తాజాగా ఓ ఇంటరర్వ్యూలో విండీస్‌ టూర్‌కు చోటు దక్కకపోవడంపై జితేష్‌ శర్మ స్పందించాడు.  

విండీస్‌ టూర్‌కు ఎంపికకాకపోవడం గురించి ఏమనుకుంటున్నారు? అని ప్రశ్నించగా.. ‘‘దేవుడు నా కోసం పెద్ద ప్లాన్‌ వేశాడు’’ ఒక్క మాటలో సమాధానమిచ్చాడు. రాహల్‌ ద్రవిడ్‌ సార్‌ నా ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నారు. మీరు చాలా బాగా రాణిస్తున్నారని, మేము మీలాంటి యువ ఆటగాళ్ల కోసం వెతుకుతున్నామని ద్రవిడ్‌ సార్‌ చెప్పారు.

నేను ఇంకా ఎక్కువగా పరుగులు సాధించాలని అనుకుంటున్నాని అతనితో చెప్పాను. అందుకు బదులుగా ఆయన నేను ఆడే పోజేషన్‌కు అవే ఎక్కువ పరుగులు అని కితాబు ఇచ్చారు. పరుగులు కాదు గెలుపు కోసం మీరు ఎంత ఎక్కువ కృషి చేస్తారో అది ముఖ్యమని ఆయన అన్నారు" అని క్రికెట్‌.కామ్‌ ఇచ్చిన ఇంటర్వ్యూలో జితేష్‌ శర్మ చెప్పుకొచ్చాడు.

విండీస్‌తో టి20 సిరీస్‌కు భారత జట్టు:
ఇషాన్ కిషన్ (వికెట్‌ కీపర్‌), శుబ్‌మన్‌ గిల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, సూర్య కుమార్ యాదవ్ (వైస్‌ కెప్టెన్‌), సంజు శాంసన్ (వికెట్‌ కీపర్‌), హార్దిక్ పాండ్యా (కెప్టెన్‌), అక్షర్ పటేల్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

చదవండి: Rohit Sharma: 'ఆటగాళ్ల మధ్య దూరానికి అది కూడా కారణమే.. రోహిత్‌ కెప్టెన్సీ అంతగా బాగోలేదు'

Videos

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)