Breaking News

భారత జట్టులో వైభవ్‌ సూర్యవంశీ

Published on Tue, 11/04/2025 - 10:58

నవంబర్‌ 14 నుంచి 23 మధ్యలో ఖతార్‌ వేదికగా జరుగబోయే రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌-2025 (ACC Cup Rising Stars 2025) కోసం 15 మంది సభ్యుల ఇండియా-ఏ (India-A) జట్టును బీసీసీఐ ఇవాళ (నవంబర్‌ 4) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా వికెట్‌కీపర్‌, బ్యాటర్‌ జితేశ్‌ శర్మ (Jitesh Sharma) ఎంపిక కాగా.. నమన్‌ ధిర్‌ (Naman Dhir) అతనికి డిప్యూటీగా నియమితుడయ్యాడు.

ఈ జట్టులో చిచ్చరపిడుగులు, ఐపీఎల్‌ సంచలనాలు ప్రియాంశ్‌ ఆర్య (Priyansh Ayra), వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) చోటు దక్కించుకున్నారు. ఈ ఇద్దరు జట్టు ఓపెనర్లుగా వ్యవహరిస్తారు. మిడిలార్డర్‌ బ్యాటర్లుగా నేహల్‌ వధేరా, నమన్‌ ధిర్‌, సూర్యాంశ్‌ షేడ్గే, రమన్‌దీప్‌ సింగ్‌, అశుతోష్‌ శర్మ ఎంపికయ్యారు. అభిషేక్‌ పోరెల్‌ సెకెండ్‌ ఛాయిస్‌ వికెట్‌కీపర్‌, బ్యాటర్‌గా చోటు దక్కించుకున్నాడు.  

పేసర్లుగా గుర్జప్నీత్‌ సింగ్‌, యశ్‌ ఠాకూర్‌, విజయ్‌ కుమార్‌ వైశాక్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌ ఎంపిక కాగా.. స్పెషలిస్ట్‌ స్పిన్నర్లుగా సుయాశ్‌ శర్మ, హర్ష్‌ దూబే చోటు దక్కించుకున్నారు. స్టాండ్‌ బై ప్లేయర్లుగా గుర్నూర్‌ బ్రార్‌, కుమార్‌ కుషాగ్రా, తనుశ్‌ కోటియన్‌, సమీర్‌ రిజ్వి, షేక్‌ రషీద్‌ను ఎంపిక చేశారు. ఈ టోర్నీలో భారత-ఏ జట్టు.. ఒమన్‌, యూఏఈ, పాకిస్తాన్‌ ఏ జట్లతో పాటు గ్రూప్‌-బిలో ఉంది.

రైజింగ్ స్టార్స్ ఆసియా కప్ కోసం భారత A జట్టు: ప్రియాంశ్‌ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, నేహల్ వధేరా, నమన్ ధిర్ (VC), సూర్యాంశ్ షెడ్గే, జితేష్ శర్మ (C) (WK), రమణదీప్ సింగ్, హర్ష్ దూబే, అశుతోష్ శర్మ, యశ్ ఠాకూర్, గుర్జప్నీత్‌ సింగ్‌, విజయ్‌కుమార్‌ వైశాక్‌, యుద్ద్‌వీర్‌ సింగ్‌ చరక్‌, అభిషేక్‌ పోరెల్ (WK), సుయాష్ శర్మ

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)