Breaking News

ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీతో జై షా భేటీ

Published on Fri, 10/31/2025 - 01:37

న్యూఢిల్లీ: 2028 లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పునరాగమనం చేస్తున్న నేపథ్యంలో... అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షురాలు క్రిస్టీ కొవెంట్రీతో అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) అధ్యక్షుడు జై షా భేటీ అయ్యారు. లుసానేలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు సమాచారం. 1900 పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో తొలిసారి క్రికెట్‌ పోటీలు నిర్వహించగా... ఆ తర్వాత మరెప్పుడూ విశ్వక్రీడల్లో క్రికెట్‌కు చోటు దక్కలేదు. 

ఇప్పుడు 128 ఏళ్ల తర్వాత లాస్‌ ఏంజెలిస్‌లో జరగనున్న ఒలింపిక్స్‌లో తిరిగి క్రికెట్‌ పోటీలు నిర్వహించనున్నారు. మహిళల, పురుషుల విభాగాల్లో ఆరేసి జట్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటుండగా... టి20 ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ‘లాస్‌ ఏంజెలిస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ పునరాగమనం చేయనుండగా... దీనిపై ఐఓసీ అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీని కలవడం ఆనందంగా ఉంది.

ఆ దిశగా ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధితో పాటు ఒలింపిక్‌ ఉద్యమంలో క్రికెట్‌ పాత్ర, దాని ప్రాధాన్యత గురించి చర్చించాం’ అని జై షా ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. ఇదే అంశంపై ఐఓసీ అధ్యక్షురాలితో ఈ ఏడాది ఆరంభంలోనూ జై షా సమావేశమయ్యారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)