Breaking News

'బజ్‌బాల్‌తో నాకు సంబంధం లేదు.. ఏమి చేయాలో నాకు తెలుసు'

Published on Tue, 01/23/2024 - 11:06

జనవరి 25 నుంచి హైదరాబాద్‌ వేదికగా ప్రారంభం కానునున్న భారత్‌ - ఇంగ్లండ్‌ మధ్య తొలి టెస్టుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే భాగ్యనగరానికి చేరుకున్న ఇరు జట్లు ప్రాక్టీస్‌లో మునిగి తేలుతున్నాయి. ఇరు జట్లు కూడా విజయంతో సిరీస్‌ను ఆరంభించాలని ఊవ్విళ్లరూతున్నాయి.

సొంతగడ్డపై టెస్టుల్లో ఇంగ్లండ్‌పై భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య భారత్‌ వేదికగా 16 సిరీస్‌లు జరగగా.. టీమిండియా 10 సిరీస్‌లలో విజయం సాధించగా, ఇంగ్లండ్‌ ఐదింట గెలుపొందింది. భారత గడ్డపై ఇంగ్లండ్‌ చివరగా టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుంది. అయితే ఇటీవల కాలంలో ఇంగ్లండ్‌ టెస్టుల్లో బజ్‌బాల్‌ క్రికెట్‌ ఆడి ప్రత్యర్ది జట్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.

టెస్టు క్రికెట్‌ను టీ20 మాదిరిగా ఆడుతున్న ఇంగ్లీష్‌ జట్టు నుంచి రోహిత్‌ సేనకు గట్టిపోటీ ఎదురుకానుంది. తాజాగా ఇంగ్లండ్‌ బాజ్‌బాల్‌పై టీమిండియా స్టార్‌ పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రా స్పందించాడు. ఈ సిరీస్‌లో ఇంగ్లండ్‌ బాజ్‌బాల్‌ను ఎదుర్కొనేందుకు తను సిద్దంగా ఉన్నాని బుమ్రా తెలిపాడు.

"ఇంగ్లండ్‌ బజ్‌బాల్‌ను నేను పరిగణలోకి తీసుకోవడం లేదు. వారిని అడ్డుకోవడానికి ఎటువంటి వ్యూహాలు రచించడం లేదు. కానీ ఇంగ్లండ్‌ మాత్రం ఇటీవల కాలంలో అద్బుతమైన క్రికెట్‌ ఆడుతున్నారు. టెస్టు ఫార్మాట్‌లో దూకుడుగా ఆడి ప్రత్యర్ది జట్లపై పైచేయి సాధించారు. టెస్టు క్రికెట్‌ను ఈ విధంగా కూడా ఆడవచ్చని ప్రపంచానికి ఇంగ్లీష్‌ జట్టు చూపించింది.

అయితే ఒక బౌలర్‌గా ఇంగ్లండ్‌పై పై చేయి సాధిస్తానని అనుకుంటున్నాను. ఎందుకంటే వారు దూకుడుగా ఆడి  న‌న్ను అల‌స‌ట‌కు గురి చేయ‌లేరు. అందువల్ల నాకు ఎక్కువగా వికెట్లు తీసే ఛాన్స్‌ ఉంటుంది. మైదానంలోకి దిగిన ప్ర‌తిసారి ప‌రిస్థితుల‌ను నాకు అనుకూలంగా ఎలా మ‌ల‌చుకోవాలి అనేదాని గురించి ఎక్కువ ఆలోచిస్తానని" ది గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బుమ్రా పేర్కొన్నాడు.
చదవండి: AUS vs WI: పీకల దాకా తాగి ఆసుపత్రి పాలైన మాక్స్‌వెల్‌..

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)