Breaking News

బుమ్ బుమ్ బుమ్రా.. దెబ్బ‌కు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది! వీడియో వైర‌ల్‌

Published on Fri, 07/11/2025 - 17:35

జ‌స్ప్రీత్ బుమ్రా.. ప్ర‌పంచ క్రికెట్‌లో అత్య‌త్తుమ బౌల‌ర్ల‌లో అగ్ర‌స్ధానంలో కొన‌సాగుతున్నాడు. బుమ్రా బౌలింగ్ చేస్తున్నాడంటే ప్ర‌త్య‌ర్ధి గుండెల్లో వ‌ణుకు పుట్టాల్సిందే. అత‌డు మ‌రోసారి త‌న స‌త్తా ఎంటో నిరూపించుకున్నాడు.

లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో జస్ప్రీత్ బంతితో మ్యాజిక్ చేస్తున్నాడు. రెండో రోజు ఆటలో ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను బుమ్రా ఔట్ చేసిన విధానం గురుంచి ఎంతచెప్పుకున్న తక్కువే. స్టోక్స్‌ను అద్బుత‌మైన బంతితో జ‌స్ప్రీత్ క్లీన్ బౌల్డ్ చేశాడు.

స్టోక్స్ మైండ్ బ్లాంక్‌..
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 86 ఓవ‌ర్ వేసిన బుమ్రా.. రెండో బంతిని రౌండ్‌ది వికెట్ నుంచి గుడ్ లెంగ్త్ డెలివ‌రీగా సంధించాడు. ఆ బంతిని స్టోక్స్ డిఫెన్స్ ఆడ‌టానికి ప్ర‌య‌త్నించాడు. ఔట్ సైడ్ ఆఫ్ దిశ‌గా ప‌డిన బంతి కొంచెం స్వింగ్ అవుతూ ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.

దీంతో ఒక్క‌సారిగా స్టోక్స్ బిత్త‌ర‌పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. తొలి రోజు ఆట‌లో కూడా ఇదే త‌ర‌హాలో హ్యారీ బ్రూక్‌ను బుమ్రా క్లీన్ బౌల్డ్ చేశాడు. స్టోక్స్‌ను ఔట్ చేసిన అనంతరం జో రూట్‌(104), క్రిస్ వోక్స్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. మొత్తంగా  ఇప్ప‌టివ‌ర‌కు బుమ్రా నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు.

లంచ్‌ బ్రేక్‌కు భారత స్కోరంతంటే?
రెండో రోజు లంచ్‌ విరామం సమయానికి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 353 పరుగులు చేసింది. క్రీజులో జేమీ స్మిత్‌(51), బ్రాడైన్‌ కార్స్‌(33) ఉన్నారు.



 

 

Videos

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)