Breaking News

బవుమాకు క్షమాపణలు చెప్పిన బుమ్రా..! వైరల్‌

Published on Sun, 11/16/2025 - 19:15

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా- సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా మధ్య నెలకొన్న 'బౌనా'(మరగుజ్జు) వివాదం సద్దమణుగింది. ఈడెన్ గార్డెన్ వేదికగా తొలి టెస్టు ముగిసిన అనతరం బుమ్రా.. బవుమా వద్దకు వెళ్లి అప్యాయంగా మాట్లాడు.

ఈ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా ఆ పదం వాడలేదని బవుమాకు బుమ్రా క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. దీంతో వెంటనే  ప్రోటీస్ కెప్టెన్ కూడా బుమ్రాను అలింగనం చేసుకుంటా నవ్వుతూ కన్పించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.

అసలేమి జరిగిందంటే?
సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 13 ఓవర్ వేసిన బుమ్రా ఆఖరి బంతిని బవుమాకు గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని బవుమా ఆడే ప్రయత్నం చేయగా బంతి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో వెంటనే బౌలర్‌తో పాటు ఫీల్డర్లు ఎల్బీకి అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నో అంటూ తల ఊపాడు. 

దీంతో ఆర్‌ఎస్  తీసుకోవాలా వద్దా అని బుమ్రా, వికెట్ కీపర్ రిషభ్ పంత్‌తో చర్చించాడు. బంతి ప్యాడ్స్‌కు ఎత్తుగా తగిలిందని పంత్ చెప్పినప్పుడు అందుకు బుమ్రా  "బౌనా భీ హై" అని సమాధనమిచ్చాడు. 'బౌనా' అనేది హిందీలో మరగుజ్జు అని అర్థం. 

బవుమా పొట్టిగా ఉండటం వల్ల బంతి స్టంప్స్‌ను మిస్ అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి జస్ప్రీత్ ఈ పదం ఉపయోగించాడు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవడంతో నెటిజన్లు బుమ్రాపై ఫైరయ్యారు. 

ఈ ఘటనపై సౌతాఫ్రికా బ్యాటింగ్‌ కోచ్‌ యాష్‌వెల్‌ ప్రిన్స్ సైతం స్పందించాడు. ఇలా జరగడం ఇదే తొలిసారి. కానీ ఇప్పటివరకు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎలాంటి చర్చా రాలేదు.  ఇక్కడ జరిగిన దాని వల్ల ఎవరికీ పెద్దగా ఇబ్బంది కలగలేదనే అనుకుంటున్నా’’ ప్రిన్స్  చెప్పుకొచ్చాడు. ఇప్పుడు బుమ్రా సారీ చెప్పడంతో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడింది. ఇక ఈ ​‍మ్యాచ్‌లో 30 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది.
చదవండి: WTC 2025-27 Points Table: టాప్‌-2కు సౌతాఫ్రికా.. మరి భారత్‌ ఏ ప్లేస్‌లో ఉందంటే?


 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)