Breaking News

చరిత్రకు అడుగు దూరంలో జస్ప్రీత్‌ బుమ్రా..

Published on Tue, 12/09/2025 - 11:36

భార‌త్‌-సౌతాఫ్రికా మ‌ధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు రంగం సిద్ద‌మైంది. ఈ సిరీస్‌లో భాగంగా తొలి టీ20 మంగ‌ళ‌వారం(డిసెంబ‌ర్ 9) జ‌ర‌గ‌నుంది. ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. స‌ఫారీల‌తో వ‌న్డే సిరీస్‌కు విశ్రాంతి తీసుకున్న టీమిండియా స్టార్ పేస‌ర్ జ‌స్ప్రీత్ బుమ్రా.. ఇప్పుడు టీ20ల్లో స‌త్తాచాటేందుకు సిద్ద‌మ‌య్యాడు. తొలి టీ20కు ముందు బుమ్రాను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. అంత‌ర్జాతీయ టీ20ల్లో వంద వికెట్ల క్ల‌బ్‌లో చేరేందుకు బుమ్రా ఒకే ఒక వికెట్ దూరంలో ఉన్నాడు.

అరుదైన రికార్డుపై కన్ను..
క‌ట‌క్ టీ20లో బుమ్రా వికెట్ సాధిస్తే వంద వికెట్ల మైలు రాయిని అందుకున్నాడు. త‌ద్వారా మూడు ఫార్మాట్ల‌లోనూ ఈ ఫీట్ సాధించిన తొలి భార‌త బౌల‌ర్‌గా బుమ్రా చ‌రిత్ర సృష్టిస్తాడు. ఈ పేస్ గుర్రం ఇప్పటికే వన్డే, టెస్టు ఫార్మాట్లలలో వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు. టీ20ల్లో ఇప్పటివరకు 80 మ్యాచ్‌లు ఆడి 99 వికెట్లు సాధించాడు. 

అయితే భారత తరపున టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో అర్ష్‌దీప్ సింగ్ 105 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ సిరీస్‌లో అర్ష్‌దీప్‌ను కూడా బుమ్రా అధిగమించే అవకాశముంది. అదేవిధంగా అన్ని ఫార్మాట్‌లలో కలిపి 500 వికెట్ల మైలురాయిని అందుకోవడానికి బుమ్రాకు 18 వికెట్లు మాత్రమే అవసరం. బుమ్రా ఇప్పటివరకు అంతర్జాతీయ క్రికెట్‌లో 221 మ్యాచ్‌లు ఆడి 482 వికెట్లు సాధించాడు.

సౌతాఫ్రికాతో తొలి టీ20 కోసం భారత జట్టు (అంచనా)..
శుభ్‌మన్‌ గిల్‌, అభిషేక్‌ శర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, జితేశ్‌ శర్మ (వికెట్‌కీపర్‌), శివమ్‌ దూబే, కుల్దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌
చదవండి: IND vs SA: టీమిండియాకు భారీ షాక్‌..!

Videos

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

బూత్‌లలో సీసీ కెమెరాలు ఎందుకు లేవు? రిగ్గింగ్ కోసమేనా ఈ ప్లాన్?

మోదీ, అమిత్ షాకు CJP అభిజీత్ స్టాంగ్ వార్నింగ్

పవన్ కళ్యాణ్ చెప్పినా వినకండి ఈ ఎన్నికల్లో మంచివాళ్లను గెలిపించండి

నాతో కాలు దువ్వితే... JC బెదిరింపులకు కేతిరెడ్డి వార్నింగ్

మేయర్ మేమే.. కూటమిలో కుర్చీలాట

నాగబాబు వల్ల జనసేన నాశనం... రాజీనామా తరువాత గూడూరు వెంకటేశ్వర రావు సంచలన కామెంట్స్

Photos

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)

+5

తిరుమల : ముత్యపుపందిరిపై సీతా స్వయంవరం అలంకారంలో శ్రీవారు (ఫొటోలు)