Breaking News

జ‌స్ప్రీత్ బుమ్రా సూప‌ర్ డెలివ‌రీ.. వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్ ఫ్యూజ్‌లు ఔట్‌! వీడియో

Published on Thu, 07/10/2025 - 22:04

లార్డ్స్ వేదిక‌గా ఇంగ్లండ్‌తో జ‌రుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రా సంచ‌ల‌న బంతితో మెరిశాడు. అద్బుత‌మైన బంతితో ఇంగ్లండ్ బ్యాట‌ర్ హ్యారీ బ్రూక్‌ను బుమ్రా బోల్తా కొట్టించాడు. బుమ్రా దెబ్బ‌కు టెస్టు వ‌ర‌ల్డ్ నెం1 బ్యాట‌ర్‌కు ఫ్యూజ్‌లు ఎగిరిపోయాయి. ఓలీ పోప్ ఔట‌య్యాక బ్రూక్ క్రీజులోకి వ‌చ్చాడు.

అప్ప‌టికే క్రీజులో పాతుకుపోయిన జో రూట్‌తో క‌లిసి ఇన్నింగ్స్‌ను ముందుకు న‌డిపించే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ బుమ్రా అత‌డికి ఆ ఛాన్స్ ఇవ్వ‌లేదు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 55వ ఓవ‌ర్ వేసిన బుమ్రా ఐదో బంతిని.. హ్యారీ బ్రూక్‌కు ఆఫ్ స్టంప్ దిశ‌గా సంధించాడు. 

140 కి.మీ వేగంతో వేసిన ఆ బంతిని బ్రూక్ ఆఫ్‌సైడ్‌ డిఫెన్స్ ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ కాస్త లోగా వ‌చ్చిన బంతి అత‌డి బ్యాట్‌ను మిస్స్ అయ్యి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. దీంతో బ్రూక్‌(8) ఒక్క‌సారిగా షాక్ అయిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌లవుతోంది. కాగా రెండో టెస్టుకు విశ్రాంతి తీసుకున్న బుమ్రా తిరిగి లార్డ్స్‌లో ఆడుతున్నాడు.

68 ఓవర్లు ముగిసే సరికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. క్రీజులో జో రూట్‌(62), బెన్‌స్టోక్స్(27) ఉన్నారు. భార‌త బౌల‌ర్ల‌లో ఇప్ప‌టివ‌ర‌కు నితీశ్ కుమార్ రెడ్డి రెండు,  జ‌స్ప్రీత్ బుమ్రా, జ‌డేజా త‌లా వికెట్ సాధించారు.



 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)