Breaking News

జస్ప్రీత్ బుమ్రా సరికొత్త చరిత్ర.. కపిల్ దేవ్ రికార్డు బ్రేక్‌

Published on Mon, 06/23/2025 - 07:56

టెస్టు క్రికెట్‌లో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా తన హవాను కొనసాగిస్తున్నాడు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగాడు. రెండో రోజు ఆటలో మూడు వికెట్లు పడగొట్టిన జస్ప్రీత్‌.. మూడో రోజు ఆటలో మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బుమ్రాకు ఇది 14వ ఫైవ్ వికెట్ హాల్ వికెట్ కావ‌డం గ‌మ‌నార్హం. ఈ క్ర‌మంలో బుమ్ బుమ్రా ప‌లు అరుదైన రికార్డుల‌ను త‌న పేరిట లిఖించుకున్నాడు.

క‌పిల్ దేవ్ రికార్డు బ్రేక్‌..
👉టెస్టు క్రికెట్‌లో ఇంగ్లండ్ గ‌డ్డ‌పై అత్య‌ధిక సార్లు అత్య‌ధిక సార్లు ఫైవ్ వికెట్ హాల్ సాధించిన భార‌త బౌల‌ర్‌గా బుమ్రా రికార్డుల‌కెక్కాడు. ఇంగ్లండ్‌లో టెస్టు మ్యాచ్ ఆడుతున్న‌ప్పుడు  బుమ్రా ఐదు వికెట్ల ఘ‌న‌త సాధించ‌డం ఇది మూడోసారి.

2018లో ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో తొలిసారి ఐదు వికెట్ల హాల్ సాధించిన బుమ్రా.. 2021లో మ‌ళ్లీ ఇంగ్లండ్ గ‌డ్డ‌పై రెండో సారి ఐదు వికెట్ల హాల్‌ను న‌మోదు చేశాడు. ఇప్పుడు తాజా ప‌ర్య‌ట‌న‌లో ముచ్చ‌ట‌గా మూడో సారి ఈ ఫీట్ సాధించాడు. ఇంత‌కుముందు ఈ రికార్డు భార‌త దిగ్గ‌జ క్రికెట‌ర్లు లాలా అమర్ నాథ్, కపిల్ దేవ్, బి చంద్రశేఖర్, భువనేశ్వర్ కుమార్, వినూ మన్కడ్, చేతన్ శర్మ, ఇషాంత్ శర్మ, మహ్మద్ నిస్సార్ మరియు సురేంద్రనాథ్‌ల పేరిట ఉండేది.

ఈ లెజెండ‌రీ క్రికెట‌ర్లు త‌మ కెరీర్‌లో రెండు సార్లు ఇంగ్లండ్ గ‌డ్డ‌పై టెస్టుల్లో ఫైవ్ వికెట్ హాల్ సాధించారు.లీడ్స్ టెస్ట్ కు ముందు బుమ్రా కూడా రెండు ఫైవ్ వికెట్ల హాల్‌తో ఈ జాబితాలో ఉండేవాడు. కానీ తాజా మ్యాచ్‌తో వీరింద‌ని బుమ్రా అధిగ‌మించాడు.

👉అదేవిధంగా విదేశీ గ‌డ్డ‌పై అత్య‌ధిక ఐదు వికెట్ల హాల్స్ సాధించిన భార‌త బౌల‌ర్‌గా క‌పిల్ దేవ్ రికార్డును బుమ్రా స‌మం చేశాడు. ఈ ఇద్దరూ విదేశాల్లో చెరో 12 సార్లు ఐదు వికెట్ల ఘనతను అందుకున్నారు.

👉సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా బౌలర్‌గా నిలిచాడు. 

విదేశాల్లో అత్య‌ధిక ఫైవ్ వికెట్స్ హాల్ సాధించిన ప్లేయ‌ర్లు.. 
👉జస్ప్రీత్ బుమ్రా - 12
👉కపిల్ దేవ్ - 12
👉అనిల్ కుంబ్లే - 10
👉ఇషాంత్ శర్మ - 9
👉ఆర్ అశ్విన్ - 8

సేనా దేశాల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టిన ఆసియా బౌల‌ర్లు
👉జస్ప్రీత్ బుమ్రా - 31 మ్యాచ్‌ల్లో 150 
👉వసీం అక్రమ్ - 32 మ్యాచ్‌ల్లో 146
👉అనిల్ కుంబ్లే - 35 మ్యాచ్‌ల్లో 141
👉ఇషాంత్ శర్మ - 40 మ్యాచ్‌ల్లో 127
👉జహీర్ ఖాన్ - 30 మ్యాచ్‌ల్లో 119

నువ్వా నేనా..
భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు ఆస‌క్తిక‌రంగా సాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. క్రీజులో కేఎల్‌ రాహుల్‌(47), శుబ్‌మన్‌ గిల్‌(6) ఉన్నారు.అంతకుముందు ఇంగ్లండ్‌ తమ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: రోహిత్‌...  ‘ప్రేమ కథా చిత్రం’

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)