Breaking News

చరిత్ర సృష్టించిన జేసన్‌ హోల్డర్‌

Published on Mon, 12/29/2025 - 19:06

విండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ (Jason Holder) చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో (2025) అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. హోల్డర్‌ ఈ ఏడాది 69 మ్యాచ్‌ల్లో 97 వికెట్లు తీశాడు. ఇంటర్నేషనల్‌ లీగ్‌ టీ20లో భాగంగా గల్ఫ్‌ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హోల్డర్‌ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో హోల్డర్‌ (అబుదాబీ నైట్‌రైడర్స్‌) 2 వికెట్లు తీసి తన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

హోల్డర్‌కు ముందు ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక టీ20 వికెట్లు తీసిన రికార్డు ఆఫ్ఘనిస్తాన్‌ బౌలర్‌ రషీద్‌ ఖాన్‌ పేరిట ఉండేది. రషీద్‌ 2018లో 61 మ్యాచ్‌ల్లో 96 వికెట్లు తీశాడు. ఈ విభాగంలో హోల్డర్‌, రషీద్‌ ఖాన్‌ తర్వాతి స్థానాల్లో డ్వేన్‌ బ్రావో, నూర్‌ అహ్మద్‌ ఉన్నారు.బ్రావో 2016లో 72 మ్యాచ్‌ల్లో 87 వికెట్లు తీయగా.. నూర్‌ అహ్మద్‌ ఇదే ఏడాది  64 మ్యాచ్‌ల్లో 85 వికెట్లు తీశాడు.

డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌
హోల్డర్‌ ఇటీవలికాలంలో డెత్‌ ఓవర్ల స్పెషలిస్ట్‌గా రాటుదేలాడు. ఈ ఏడాది అతను తీసిన 97 వికెట్లలో 45 వికెట్లు డెత్‌ ఓవర్లలో తీసినవే. 2022లో 59 వికెట్లు తీసిన హోల్డర్‌.. ఈ ఏడాది తన వికెట్ల శాతాన్ని భారీగా మెరుగుపర్చుకున్నాడు. టీ20 స్పెషలిస్ట్‌ అయిన హోల్డర్‌ను ఐపీఎల్‌ 2026 వేలంలో గుజరాత్‌ టైటాన్స్‌ రూ. 7 కోట్ల రికార్డు ధరకు సొంతం చేసుకుంది.

హోల్డర్‌ ఈ ఏడాది తన జాతీయ జట్టుతో (విండీస్‌) పాటు ఐదు వేర్వేరు ఫ్రాంచైజీలకు ఆడాడు. ఈ ఏడాది అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో హోల్డర్‌ తర్వాతి స్థానాల్లో నూర్ అహ్మద్‌ (85), హసన్ అలీ (71), హారిస్ రౌఫ్‌ (66) ఉన్నారు. రషీద్ ఖాన్‌ ఈ ఏడాది గాయాల కారణంగా కేవలం 63 వికెట్లకే పరిమితమయ్యాడు.

చదవండి: రిటైర్మెంట్‌ ప్రకటించిన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ బ్రేస్‌వెల్‌
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)