Breaking News

టీమిండియాతో టీ20 సిరీస్‌.. దక్షిణాఫ్రికా జట్టు ప్రకటన.. స్టార్‌ పేసర్లు రీ ఎంట్రీ

Published on Thu, 10/31/2024 - 16:20

త్వరలో టీమిండియాతో జరుగబోయే నాలుగు మ్యాచ్‌ల టీ20 కోసం దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (అక్టోబర్‌ 31) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఎంపికయ్యాడు. గత కొంతకాలంగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న మార్కో జన్సెన్‌, గెరాల్డ్‌ కొయెట్జీ ఈ సిరీస్‌తో రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ సిరీస్‌ కోసం లుంగి ఎంగిడిని పరిగణలోకి తీసుకోలేదు. ఎంగిడిని త్వరలో శ్రీలంకతో జరుగబోయే రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం రిజర్వ్‌గా ఉంచారు. 

సౌతాఫ్రికా యూఏఈలో ఆడిన వైట్‌బాల్‌ సిరీస్‌లకు దూరంగా ఉన్న హెన్రిచ్‌ క్లాసెన్‌, డేవిడ్‌ మిల్లర్‌, కేశవ్‌ మహారాజ్‌ 16 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు ఎంపికయ్యారు. ఈ సిరీస్‌లో కగిసో రబాడ ఆడటం లేదు. సెలెక్టర్లు అతనికి విశ్రాంతినిచ్చారు. ఆల్‌రౌండర్‌ మిహ్లాలీ మ్పోంగ్వానా తొలిసారి జాతీయ జట్టుకు ఎంపిక కాగా.. అన్‌క్యాప్డ్‌ ఆల్‌రౌండర్‌ అండీల్ సైమ్‌లేన్‌ కూడా జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

ఈ సిరీస్‌లో నకాబా పీటర్‌ మరో స్పిన్‌ ఆప్షన్‌గా ఉన్నాడు. జాతీయ కాంట్రాక్ట్‌ దక్కని తబ్రేజ్‌ షంషిని సెలక్టర్లు పరిగణలోకి తీసుకోలేదు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌ పర్యటనలో ఉన్న ఎయిడెన్‌ మార్క్రమ్‌, కేశవ్‌ మహారాజ్‌, ర్యాన్‌ రికెల్టన్‌, ట్రిస్టన్‌ స్టబ్స్‌ నవంబర్‌ 4న మిగతా జట్టు సభ్యులతో కలుస్తారు.

టీమిండియాతో టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్‌), ఒట్నీల్ బార్ట్‌మన్, గెరాల్డ్ కోయెట్జీ, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, హెన్రిచ్ క్లాసెన్, పాట్రిక్ క్రూగర్, కేశవ్ మహరాజ్, డేవిడ్ మిల్లర్, మిహ్లాలీ మ్పోంగ్వానా, నకాబా పీటర్‌, ర్యాన్‌ రికెల్టన్‌, అండీల్ సైమ్‌లేన్‌, లూథో సిపామ్లా, రిస్టన్ స్టబ్స్

భారత జట్టు: సూర్యకుమార్‌ యాదవ్‌ (కెప్టెన్‌), తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌, రమన్‌దీప్‌ సింగ్‌, హార్దిక్‌ పాండ్యా, అభిషేక్‌ శర్మ, అక్షర్‌ పటేల్‌, సంజూ శాంసన్‌, జితేశ్‌ శర్మ, రవి బిష్ణోయ్‌, విజయ్‌కుమార్‌ వైశాఖ్‌, వరుణ్‌ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్‌, యశ్‌ దయాల్‌, ఆవేశ్‌ ఖాన్‌

షెడ్యూల్‌..
తొలి టీ20- నవంబర్‌ 8- డర్బన్‌
రెండో టీ20- నవంబర్‌ 10- గ్వెబెర్హా
మూడో టీ20- నవంబర్‌ 13- సెంచూరియన్‌
నాలుగో టీ20- నవంబర్‌ 15- జొహనెస్‌బర్గ్‌

చదవండి: IND vs NZ 3rd Test: బుమ్రాకు విశ్రాంతి..?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)