Breaking News

చాలా సంతోషంగా ఉంది.. అతడు భయపెట్టాడు..! భారత క్రికెట్‌కు చాలా మంచిది

Published on Mon, 05/01/2023 - 08:40

ఐపీఎల్‌-2023లో భాగంగా వాంఖడే వేదికగా  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ సంచలన విజయం సాధించింది. 213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ముంబై విజయంలో ఆ జట్టు ఆటగాడు టిమ్‌ డేవిడ్‌ కీలక పాత్ర పోషించాడు.

హోల్డర్‌ వేసిన ఆఖరి ఓవర్‌లో ముంబై గెలుపుకు 17 పరుగులు అవసరమవ్వగా.. టిమ్‌ డెవిడ్‌ వరుసగా మూడు సిక్స్‌లు బాది తన జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఇక విజయంపై ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ స్పందించాడు. జైస్వాల్, టిమ్‌ డేవిడ్‌ అద్భుత ఇన్నింగ్స్‌లు  ఆడాడని రోహిత్‌ కొనియాడాడు.

Photo Credit : IPL Website

జైస్వాల్‌ ఒక యువ సంచలనం..
"ఇంత పెద్ద టార్గెట్‌ను ఛేదించడం చాలా సంతోషంగా ఉంది. ఆఖరి మ్యాచ్‌లో కూడా మేము దగ్గరకు వచ్చి ఓటమిపాలైం. మా జట్టులో అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నారు. మా జట్టులో పొలార్డ్‌ స్థానాన్ని డేవిడ్‌ భర్తీ చేశాడు. పొలార్డ్‌ చాలా సీజన్‌లపాటు మా జట్టులో ఉన్నాడు. మేము ఐదు సార్లు చాంపియన్స్‌గా నిలవడంలో పాలీ తనవంతు పాత్రపోషించాడు. ఇప్పడు డేవిడ్‌ కూడా అదే పనిచేస్తాడని ఆశిస్తున్నాము.

Photo Credit : IPL Website

టిమ్‌కు చాలా బ్యాటింగ్‌ పవర్‌ ఉంది. లోయార్డర్‌లో డేవిడ్‌ వంటి విధ్వంసకర ఆటగాడు ఉండడం చాలా అవసరం. ఎందుకంటే అటువంటి పవర్ హిట్టర్‌ క్రీజులో ఉంటే ఎటువంటి బౌలరైనా ఒత్తడికి లోనవుతాడు. ఇక ప్రతీ మ్యాచ్‌కు తుది జట్టును ఎంపిక చేయడం చాలా కష్టం. అక్కడ పరిస్ధితులు బట్టి జట్టును ఎంపికచేస్తాం. ఇక జోఫ్రా అర్చర్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదు.

అదే విధంగా అతడు చాలా కాలం పాటు బంతి పట్టుకోలేదు. కాబట్టి అతడికి ఇంకా చాలా ప్రాక్టీస్‌ అవసరం. అయినా ఈ మ్యాచ్‌లో మంచి పేస్‌తో బౌలింగ్‌ చేశాడు.  సూర్య కూడా తన రిథమ్‌ను తిరిగి పొందడం చాలా సంతోషంగా ఉంది. ఇక జైశ్వాల్‌ గురుంచి ఎంత చెప్పుకున్న తక్కువే. గతేడాదే అతడు అద్భుతంగా ఆడటం నేను చూశాను. కానీ ఈ ఏడాది అంతకు రెట్టింపు ఆడుతున్నాడు.

Photo Credit : IPL Website
బ్యాటింగ్‌లో అంత పవర్‌ను ఎలా జనరేట్‌ చేస్తున్నవాని జైస్వాల్‌ను ఇన్నింగ్స్‌ బ్రేక్‌లో ఆడిగా. అందుకు బదులుగా జిమ్‌లో ఎక్కువ సమయం గడపడం వల్ల సాధ్యపడుతుందని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో అతడిని ఆపడం మాతరం కాలేదు. నిజంగా మేము భయపడ్డాం. ఇక అతడు అద్భుతఫామ్‌లో ఉండడం.. రాజస్తాన్‌తో పాటు భారత క్రికెట్‌కు కూడా చాలా మంచిది" అని పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌ రోహిత్‌ పేర్కొన్నాడు.
చదవండి: #Yashasvi Jaiswal: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన జైశ్వాల్‌.. తొలి క్రికెటర్‌గా!

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)