Breaking News

ఇంగ్లండ్‌ యువ కెరటానికి జాక్‌పాట్‌

Published on Tue, 03/10/2026 - 16:04

టీ20 ప్రపంచకప్‌-2026 సెమీఫైనల్లో భారత్‌పై మెరుపు శతకం సాధించిన ఇంగ్లండ్‌ యువ కెరటం జేకబ్‌ బేతెల్‌కు తగిన నజరానా లభించింది. హండ్రెడ్ లీగ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ ఫ్రాంచైజీ 2026 ఎడిషన్‌ కోసం అతన్ని కెప్టెన్‌గా నియమించింది. లియామ్ లివింగ్‌స్టోన్ స్థానంలో బేతెల్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు ఫీనిక్స్‌ యాజమాన్యం ప్రకటించింది.  

22 ఏళ్ల బేతెల్‌కు గతంలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌గా పని చేసిన అనుభవం కూడా ఉంది. గతేడాది అతను ఐర్లాండ్‌ పర్యటనలో సారధిగా వ్యవహరించాడు. ఆ పర్యటనలో బేతెల్‌ నేతృత్వంలో ఇంగ్లండ్‌ జట్టు 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌ తర్వాత అతి పిన్న వయసులో ఇంగ్లండ్ కెప్టెన్‌గా పని చేసిన రికార్డు బేతెల్‌ వశమైంది.

ఫీనిక్స్ కెప్టెన్‌గా ఎంపిక కావడంపై బేతెల్‌ స్పందించాడు. ఇది నాకు దక్కిన గౌరవమని పేర్కొన్నాడు. ఇంగ్లండ్ జట్టును నడిపిన అనుభవం నాకు చాలా నేర్పింది. ఇప్పుడు కొత్త  బాధ్యతను స్వీకరించాడని సిద్ధంగా ఉన్నానని తెలిపాడు.  

బేతెల్‌ తాజాగా భారత్‌తో జరిగిన పొట్టి ప్రపంచకప్‌ రెండో సెమీఫైనల్లో పేట్రేగిపోయాడు. కేవలం 48 బంతుల్లో 105 పరుగులు చేసి తన జట్టును గెలుపుకు దగ్గరగా తీసుకెళ్లాడు. భారీ లక్ష్య ఛేదనలో ఓ పక్క వికెట్లు పడుతున్నా, ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు. 

ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన భారత్‌.. ఆతర్వాత ఫైనల్లో న్యూజిలాండ్‌ను కూడా చిత్తు చేసి వరుసగా రెండో ఎడిషన్‌లో జగజ్జేతగా అవతరించిన విషయం తెలిసిందే. ఈ ప్రపంచకప్‌లో బేతెల్‌ 8 ఇన్నింగ్స్‌ల్లో 35 సగటున 280 పరుగులు చేశాడు.

ఐపీఎల్‌లో సవాలు
హండ్రెడ్‌ లీగ్‌లో బేతెల్‌కు కెప్టెన్సీ దక్కినా ఐపీఎల్‌ మాత్రం తుది జట్టు స్థానం దక్కడమే గగనంగా మారింది. గత ఎడిషన్‌లో బేతెల్‌ను ఆర్సీబీ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆర్సీబీలో అప్పటికే ఫిల్ సాల్ట్, టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, జోష్ హేజిల్‌వుడ్ వంటి విదేశీ ఆటగాళ్లు ఉండటంతో బేతెల్‌కు తుది జట్టులో స్థానం దక్కలేదు. మరి ఈ సీజన్‌లో అయినా అవకాశాలు లభిస్తాయో లేదో చూడాలి. 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)