Breaking News

ధోనితో వాదించిన రుతురాజ్‌.. ఎవరి ఆదేశాలు పాటించాలి?

Published on Wed, 03/27/2024 - 11:21

'I've to look at both Dhoni and Ruturaj for instructions: గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు చెన్నై సూపర్‌ కింగ్స్‌ పేసర్‌ దీపక్‌ చహర్‌. ఓపెనర్లు వృద్ధిమాన్‌ సాహా(21), కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌(8) రూపంలో రెండు కీలక వికెట్లు తీసి సీఎస్‌కే విజయంలో కీలక పాత్ర పోషించాడు.

చెపాక్‌ వేదికగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొత్తంగా నాలుగు ఓవర్ల కోటా పూర్తి చేసి కేవలం 28 పరుగులే ఇచ్చి.. రెండు వికెట్లు పడగొట్టాడు. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024లో భాగంగా గుజరాత్‌తో  మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో సీఎస్‌కే అదరగొట్టిన విషయం తెలిసిందే.

సొంత మైదానంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై.. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనలో గుజరాత్‌ను 143 పరుగులకే కట్టడి చేసి.. 63 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. 

ఈ నేపథ్యంలో విజయానంతరం దీపక్‌ చహర్‌ జియో సినిమాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా టీమిండియా దిగ్గజం, కామెంటేటర్‌ సునిల్‌ గావస్కర్‌ నుంచి చహర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. ‘బౌలింగ్‌ చేసేటపుడు నువ్వు ధోనితో చర్చిస్తావా? లేదంటే గైక్వాడ్‌తోనా? ఆదేశాల కోసం ఎవరివైపు చూస్తావు?’ అని గావస్కర్‌ అడిగాడు.

ఎవరి ఆదేశాలు పాటించాలో అర్థం కావడం లేదు
ఇందుకు బదులిస్తూ.. ‘‘నేను ఇప్పుడు మహీ భాయ్‌, రుతురాజ్‌.. ఇద్దరి వైపూ చూడాల్సి వస్తోంది. ఒక్కోసారి మహీ భాయ్‌ను చూడాలా లేదంటే రుతురాజ్‌ను చూడాలా అన్నది అర్థం కావడం లేదు. ఆ విషయంలో కాస్త కన్ఫ్యూజన్‌ అయితే ఉంది.

ఏదేమైనా రుతురాజ్‌ తనదైన శైలిలో సమర్థవంతంగానే జట్టును ముందుకు నడిపిస్తున్నాడు’’ అని దీపక్‌ చహర్‌ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్‌-2024 ఆరంభానికి ఒక్కరోజు ముందు సీఎస్‌కే కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న ధోని.. పగ్గాలను రుతురాజ్‌కు అప్పగించిన విషయం తెలిసిందే. అయితే, ఫీల్డింగ్‌ సెట్‌ చేసే విషయంలో మాత్రం ధోని జోక్యం చేసుకుంటూనే ఉన్నాడు.

కొత్త నిబంధనలు మాకే ఉపయోగకరం
ఈ క్రమంలో గుజరాత్‌తో మ్యాచ్లో రుతురాజ్‌ ధోనితో వాదించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌-2024 సందర్భంగా ప్రవేశపెట్టిన కొత్త నిబంధనల గురించి మాట్లాడుతూ.. ‘‘సీఎస్‌కేకు ఆడుతున్న తొలినాళ్ల నుంచే పవర్‌ ప్లేలో నేను మూడు ఓవర్లు బౌల్‌ చేస్తున్నా. కొత్త నిబంధనలకు అనుగుణంగానే నా ఆట తీరులో మార్పు చేసుకుంటున్నా.

గతంలో ఆరంభ ఓవర్‌లోనే 2-3 బౌన్సర్లు వేస్తే.. ఆ తర్వాత ఫుల్‌ లెంగ్త్‌ బాల్‌ను ఎదుర్కొనేందుకు బ్యాటర్లు సిద్ధంగా ఉండేవారు. అయితే, ఇప్పుడు కొత్తగా ఒక ఓవర్‌లో కేవలం రెండు బౌన్సర్లకే అనుమతినిచ్చారు.

పేసర్లకు ఈ రూల్‌ అనుకూలంగా ఉంది. పెద్దగా తేమ లేని వికెట్‌పై బంతిపై గ్రిప్‌ సాధించేందుకు కచ్చితంగా ఉపయోగపడుతుంది’’ అని చహర్‌ చెప్పుకొచ్చాడు. కాగా ఈ గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మెరుపు అర్ధ శతకం(23 బంతుల్లో 51)తో చెలరేగిన సీఎస్‌కే ఆల్‌రౌండర్‌ శివం దూబే ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: #Rohit Sharma: రోహిత్‌ శర్మ ఫ్లైయింగ్‌ కిస్‌.. ఫొటోలు డిలీట్‌ చేసిన సన్‌రైజర్స్‌

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)