Breaking News

IND vs ENG 5th Test: ‘వాళ్లు అతి చేశారు.. అందుకే’

Published on Wed, 07/30/2025 - 08:52

టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ (Gautam Gambhir)- ఓవల్‌ పిచ్‌ క్యూరేటర్‌ మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంపై భారత జట్టు బ్యాటింగ్‌ కోచ్‌ సితాన్షు కొటక్‌ (Sitanshu Kotak) వివరణ ఇచ్చాడు. ఓవల్‌ గ్రౌండ్‌ క్యురేటర్‌ కాస్త దూకుడైన వ్యక్తి అని తమకు ముందే తెలుసని తెలిపాడు. 

మేమేమీ స్పైక్స్‌తో రాలేదు
ఈ సిరీస్‌లో ఆడిన నాలుగు టెస్టుల్లోనూ పిచ్‌ క్యురేటర్లు తమకు బాగా సహకరించారని, ఇక్కడే ఇలాంటి అనుభవం ఎదురైందని చెప్పాడు. ‘ఒక జట్టు కోచ్‌ను 2.5 మీటర్ల దూరం నిలబడమని చెప్పడం చాలా ఇబ్బందిగా అనిపించింది.

మేమేమీ స్పైక్స్‌తో రాలేదు. రబ్బరు చెప్పులతో అక్కడ నిలబడ్డాం కాబట్టి పిచ్‌ పాడవుతుందనే సమస్యే లేదు. అలా ఎవరైనా ఎందుకు చేస్తారు. పిచ్‌ను జాగ్రత్తగా చూసుకోవడాన్ని అర్థం చేసుకోవచ్చు గానీ ఇది కాస్త అతిగా అనిపించింది.  

అది క్రికెట్‌ పిచ్‌ మాత్రమే
మా జట్టు సభ్యులు అక్కడ ఆడబోతున్నారు. ఎన్ని మాటలు చెప్పినా అది క్రికెట్‌ పిచ్‌ మాత్రమే. కాలు పెట్టగానే విరిగిపోయేందుకు అదేమీ 200 ఏళ్లనాటి పురాతన వస్తువు కాదు’ అని కొటక్‌ వివరించాడు. కాగా ఇంగ్లండ్‌తో నిర్ణయాత్మక ఐదో టెస్టుకు టీమిండియా సన్నద్ధమవుతున్న విషయం తెలిసిందే. 

లండన్‌లోని ఓవల్‌ మైదానంలో జరిగే ఆఖరి పోరుకు సిద్ధమయ్యే క్రమంలో భారత ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడుస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఆప్షనల్‌ ప్రాక్టీస్‌ నేపథ్యంలో ప్లేయర్లతో పాటు కోచింగ్‌ బృందం మైదానానికి వెళ్లింది.

హద్దుల్లో ఉండు
ఈ క్రమంలో హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ తన సహచర సిబ్బందితో కలిసి పిచ్‌ను పరిశీలించేందుకు వెళ్లాడు. అయితే, ఓవల్‌ మైదానం క్యూరేటర్‌ లీ ఫోర్టస్‌ బృందంలోని ఓ సభ్యుడు గంభీర్‌, అతడి సహచరులను పిచ్‌కు దూరంగా ఉండమని హెచ్చరించాడు. 

పిచ్‌ పాడకుండా జాగ్రత్తలు చెప్పే క్రమంలో అతడు కాస్త ‘అతి’గా ప్రవర్తించడంతో చిర్రెత్తిపోయిన గంభీర్‌.. ‘నువ్వు గ్రౌండ్స్‌మెన్‌వి మాత్రమే. హద్దుల్లో ఉండు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో సితాన్షు కొటక్‌ వచ్చి క్యూరేటర్‌ను దూరంగా తీసుకువెళ్లడంతో వివాదం సద్దుమణిగింది.  ఇదిలా ఉంటే.. క్యూరేటర్‌- గంభీర్‌ మధ్య వాగ్వాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

చదవండి: ‘స్టోక్స్‌ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)