టీమిండియా బ్యాటర్ల విధ్వంసం.. న్యూజిలాండ్‌ టార్గెట్‌ 272

Published on Sat, 01/31/2026 - 20:47

తిరువ‌నంత‌పురం వేదిక‌గా న్యూజిలాండ్ జ‌రుగుతున్న ఐదో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. సంజూ శాంస‌న్ ఆరంభంలోనే ఔటైన‌ప్ప‌టికి మిగితా బ్యాట‌ర్లు మాత్రం కివీస్ బౌల‌ర్ల‌ను ఉతికారేశారు.

వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఇషాన్ కిష‌న్ విధ్వంస‌క‌ర సెంచ‌రీతో మెరిశాడు. సంజూ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన ఇషాన్ ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌పై భారీ షాట్ల‌తో విరుచుకుప‌డ్డాడు. ఓవ‌రాల్‌గా 43 బంతులు ఎదుర్కొన్న ఇషాన్‌.. 4 ఫోర్లు, 10 సిక్స్‌లతో 103 పరుగులు చేశాడు. అత‌డితో పాటు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్‌(30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 63) మెరుపు హాఫ్ సెంచరీ సాధించాడు. 

అదేవిధంగా హార్దిక్ పాండ్యా(17 బంతుల్లో 1 ఫోర్లు, 4 సిక్స్‌లతో 42), అభిషేక్‌ శర్మ(16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30) దూకుడుగా ఆడారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్ రెండు, శాంట్నర్‌, జేమిసన్‌, డఫీ తలా వికెట్ సాధించారు.

Videos

ఫ్లెక్సీని చూసి తన తల్లి అనుకొని.. పాల కోసం ఆకలితో లేగదూడ తంటాలు

నువ్వు జోక్యం చేసుకుంటే.. నీ హోంమినిస్టర్ పోస్ట్ ఊడిపోతుంది..!

సాక్షి టీవీ సోషల్ మీడియా అకౌంట్లను బ్లాక్ చేయించిన కూటమి సర్కార్

దగ్గుపాటి ప్రసాద్ కు గంగారాం షాక్!

బస్సును ముద్దాడిండు డ్రైవరన్న

ప్రియుడితో కలిసి భర్తను చంపేందుకు భార్య కుట్ర

అవి వాళ్ళు రాస్తే వచ్చే మార్కులు కాదు.. SGT ప్రభాకర్ కు ఉద్యోగం ఎలా ఇచ్చారంటే

ఇంకెన్నాళ్లు నీ కొడుకును కాపాడుకుంటావ్.. వైఎస్ జగన్ సెన్సేషనల్ కామెంట్స్

ఒక రోజుకు 80 లక్షలు... ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నారు..!

చైనా వేదికపై ఫేక్ మేయర్ ప్రచారం?

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)