Breaking News

సెంచరీతో చెలరేగిన ఇషాన్‌ కిషన్‌.. 86 బంతుల్లోనే!

Published on Fri, 08/16/2024 - 19:19

టీమిండియా యువ క్రికెటర్‌ ఇషాన్‌ కిషన్‌ రెడ్‌బాల్‌ క్రికెట్‌ పునరాగమనం అదిరిపోయింది. ఆకాశమే హద్దుగా 86 బంతుల్లోనే శతక్కొట్టాడు ఈ జార్ఖండ్‌ డైనమైట్‌. భారత జట్టులో చోటే లక్ష్యంగా కఠినంగా శ్రమిస్తున్నానని సెలక్టర్లకు తన సెంచరీతో సందేశం పంపించాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో తనను ఉద్దేశపూర్వకంగా బెంచ్‌కే పరిమితం చేశారని ఇషాన్‌ కిషన్‌ మధ్యలోనే నిష్క్రమించినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

రంజీల్లో ఆడనందుకు వేటు 
మానసిక ఇబ్బందులు అని చెప్పి ఆ టూర్‌ మధ్యలోనే స్వదేశానికి తిరిగి వచ్చిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. తదుపరి కుటుంబంతో ట్రిప్‌నకు వెళ్లాడు. ఈ నేపథ్యంలో ఇషాన్‌పై కన్నెర్ర చేసిన భారత క్రికెట్‌ నియంత్రణ మండలి.. దేశవాళీ క్రికెట్‌ ఆడిన తర్వాతే టీమిండియాలో మళ్లీ చోటు దక్కుతుందని అతడికి స్పష్టం చేసింది. అయినప్పటికీ.. స్వరాష్ట్రానికి చెందిన జార్ఖండ్‌ తరఫున రంజీల్లో ఆడటానికి అతడు నిరాకరించాడు.

ఫలితంగా సెంట్రల్‌ కాంట్రాక్టు నుంచి తప్పిస్తూ బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ఐపీఎల్‌-2024లో ఇషాన్‌ కిషన్‌ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో కెరీర్‌పై దృష్టి సారించిన ఈ జార్ఖండ్‌ బ్యాటర్‌... బుచ్చిబాబు టోర్నమెంట్‌ ద్వారా తిరిగి రెడ్‌బాల్‌ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. జార్ఖండ్‌కు కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ డైనమైట్‌.. మధ్యప్రదేశ్‌తో తమ తొలి మ్యాచ్‌లో శతకంతో కదం తొక్కాడు.

సిక్సర్‌తో సెంచరీ పూర్తి
సిక్సర్‌తో సెంచరీ మార్కు అందుకున్న ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. అంతకుముందు.. మధ్యప్రదేశ్‌ ఇన్నింగ్స్‌ సమయంలో మూడు అద్భుత క్యాచ్‌లతో మెరిసి వికెట్‌ కీపర్‌గానూ తనను తాను నిరూపించుకున్నాడు 26 ఏళ్ల ఇషాన్‌ కిషన్‌. 

కాగా జార్ఖండ్‌తో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్‌ 225 పరుగులకు ఆలౌట్‌ అయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఇషాన్‌ సెంచరీ కారణంగా జార్ఖండ్‌ 69.1 ఓవర్లోనే 233 పరుగుల మార్కు అందుకుంది. ఇక టీమిండియా తరఫున ఈ జార్ఖండ్‌ కెప్టెన్‌ చివరగా 2023 నవంబరులో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో భాగమయ్యాడు.

చదవండి: తప్పంతా ఆమెదేనా?.. ఇంకా మగాడు మగాడే అంటారా?: సిరాజ్‌ పోస్ట్‌ వైరల్‌

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)