ఇషాన్ కిషన్‌కు ఆ జట్టు నుంచి పిలుపు.. అక్కడ బాగా రాణిస్తే?

Published on Fri, 06/20/2025 - 21:23

ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిష‌న్ ఆడ‌నున్నాడు. డివిజన్‌–1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో నాటింగ్‌హామ్‌షైర్ క్రికెట్ క్ల‌బ్‌తో కిష‌న్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. రాబోయో కౌంటీ సీజ‌న్‌లో కిష‌న్ నాటింగ్‌హామ్‌షైర్ త‌ర‌పున రెండు మ్యాచ్‌లు ఆడ‌నున్నాడు. సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ కైల్ వెర్రెయిన్ స్థానంలో కిష‌న్‌ను నాటింగ్‌హామ్ త‌మ జ‌ట్టులోకి తీసుకుంది. 

ఈ సౌతాఫ్రికా వికెట్ కీప‌ర్ రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడేందుకు జింబాబ్వేకు వెళ్ల‌నున్నాడు. వెర్రెయిన్ గైర్హ‌జ‌రీలో కిష‌న్‌ రెండు వారాల పాటు వికెట్ కీపింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తించ‌నున్నాడు. కిషన్ జూన్ 22 నుండి 26 వరకు ట్రెంట్ బ్రిడ్జ్‌లో యార్క్‌షైర్‌తో, జూన్ 29 నుండి జూలై 2 వరకు టౌంటన్‌లో సోమర్‌సెట్‌పై ఆడ‌నున్నాడు.

ఈ విష‌యాన్ని ఇషాన్ ధ్రువీక‌రించాడు. ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్‌లో తొలిసారి ఆడేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాని కిషన్ తెలిపాడు. ఇక 10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఒప్పందం కుద‌ర్చుకున్న మూడో భార‌త ఆట‌గాడిగా ఈ జార్ఖండ్ ఆట‌గాడు నిలిచాడు.

కిష‌న్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్‌షైర్, హాంప్‌షైర్‌లతో  జ‌తక‌ట్టారు. కాగా ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గ‌తేడాది బీసీసీఐ నిబంధ‌న‌లు ఉల్ల‌ఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన కిషన్‌.. తిరిగి ఈ ఏడాది తన కాం‍ట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు. 

ఇప్పుడు కౌంటీల్లో మెరుగ్గా రాణిస్తే.. భారత జట్టులోకి తిరిగి పునరాగమనం చేసే అవకాశముంది. టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా కిషన్‌కు పిలుపు వచ్చే అవకాశముంది.
చదవండి: ఇంగ్లండ్‌తో తొలి టెస్టు.. యశస్వి జైశ్వాల్‌ సూపర్‌ సెంచరీ

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)