Breaking News

రీఎంట్రీలో పేలని పాకెట్‌ డైనమైట్‌

Published on Tue, 02/27/2024 - 20:30

దాదాపు మూడు నెలల విరామానంతరం కాంపిటేటివ్‌ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌.. రీఎంట్రీలో తుస్సుమనిపించాడు. ముంబై వేదికగా జరుగుతున్న డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో ఊహించినంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ టోర్నీలో ఆర్బీఐ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఇషాన్‌.. రూట్‌ మొబైల్‌ లిమిటెడ్‌ జట్టుతో ఇవాళ (ఫిబ్రవరి 27) జరిగిన మ్యాచ్‌లో తేలిపోయాడు.

ఈ మ్యాచ్‌లో ఇషాన్‌కు మెరుపు అరంభమే లభించినప్పటికీ.. ఆతర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. 12 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 19 పరుగులు చేసిన అతను.. మ్యాక్స్‌వెల్‌ స్వామినాథన్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయి ప్రదర్శన చేయలేకపోయిన ఇషాన్‌.. వికెట్‌కీపింగ్‌లో పర్వాలేదనిపించాడు. ఈ మ్యాచ్‌లో అతను ఇద్దరిని ఔట్‌ చేయడంలో భాగమయ్యాడు. సుమిత్‌ క్యాచ్‌ పట్టిన ఇషాన్‌..  సయన్‌ మొండల్‌ను స్టంపౌట్‌ చేశాడు. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన రూట్‌ మొబైల్‌ లిమిటెడ్‌.. నిర్ణీత ఓవర్లు బ్యాటింగ్‌ చేసి 193 పరుగల లక్ష్యాన్ని నిర్దేశించగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఇషాన్‌ జట్టు ఆర్బీఐ 16.3 ఓవర్లలో 103 పరుగులకే ఆలౌటై, ఓటమిపాలైంది.

ఇదిలా ఉంటే, ఇషాన్‌... టీమిండియా తరఫున తన చివరి టీ20ని 2023 నవంబర్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. అనంతరం సౌతాఫ్రికా పర్యటనకు ఎంపికైనప్పటికీ వ్యక్తిగత కారణాలను సాకుగా చూపి సిరీస్‌ మధ్యలోనే ఇంటికి తిరిగొచ్చేశాడు. ఆతర్వాత రంజీల్లో ఆడి ఫామ్‌ను నిరూపించుకోవాలని బీసీసీఐతో పాటు చాలా మంది మాజీలు సూచించినా పెడచెవిన పెట్టిన ఇషాన్‌.. తాజాగా బీసీసీఐ కన్నెర్ర చేయడంతో దిగొచ్చి స్థానిక డీవై పాటిల్‌ టీ20 టోర్నీలో ఆడుతున్నాడు. ఇషాన్‌ తీరుతో గుర్రుగా ఉన్న బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ రద్దు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. 


 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)