Breaking News

అగ్రపీఠంపై పాకెట్‌ డైనమైట్‌

Published on Wed, 07/01/2026 - 14:18

ఐసీసీ తాజాగా విడుదల చేసిన వారాంత ర్యాంకింగ్స్‌లో టీమిండియా పాకెట్‌ డైనమైట్‌ ఇషాన్‌ కిషన్‌ సరికొత్త నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో సహచర టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌ అభిషేక్‌ శర్మను రెండో స్థానానికి నెట్టాడు. ఇషాన్‌, అభిషేక్‌ మధ్య 7 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇషాన్‌ ఖాతాలో 876 రేటింగ్‌ పాయింట్లు ఉండగా.. అభిషేక్‌ ఖాతాలో 869 రేటింగ్‌ పాయింట్లు ఉన్నాయి.

మరోపక్క టెస్ట్‌ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్‌ ఆటగాడు ట్రవిస్‌ హెడ్‌ అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లు జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ను వెనక్కు నెట్టి టాప్‌ ప్లేస్‌కు చేరాడు. హెడ్‌ (853), బ్రూక్‌ (852), రూట్‌ (840) మధ్య పాయింట్ల వ్యత్యాసం​ చాలా తక్కువగా ఉంది. 

ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్ల హవా కొనసాగింది. ఆ జట్టు టాప్‌-3 ప్లేయర్లు టీ20, టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.

ముఖ్యంగా ఇషాన్‌ కిషన్‌ గురించి మాట్లాడుకోవాలి. కొంతకాలం కిందట అతడికి టీమిండియాలో చోటే లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రపంచ నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. అలాగే భారత వన్డే జట్టులో కూడా చోటు సంపాదించాడు. భారత్‌ తాజా టీ20 టైటిల్‌ సాధించడంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఓ దశలో జట్టులో చోటే లేని ఇషాన్‌ అద్భుతమైన కమ్‌బ్యాక్‌ ఇచ్చి తానేంటో ప్రపంచానికి చాటాడు.

టీమిండియాలో చోటుతో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయిన ఇషాన్‌.. దేశవాలీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి మరోసారి టీమిండియా తలుపులు తట్టాడు. జాతీయ జట్టులోకి రీఎంట్రీకి ముందు దాదాపుగా ప్రతి దేశవాలీ టోర్నీలోనూ శతకాలు బాదాడు. కెప్టెన్‌గానూ తన జట్టుకు సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ అందించాడు. 

ఈ ప్రదర్శనల కారణంగా భారత టీ20 జట్టులోకి వచ్చి, వచ్చీ రాగానే తన మార్కును చూపించాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో పాటు టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు, అలాగే ఫైనల్లో మ్యాచ్‌ విన్నింగ్‌ అర్ద సెంచరీ చేశాడు. 

ఈ ప్రదర్శన తర్వాత వన్డే జట్టులోకీ వచ్చి, అక్కడ కూడా వచ్చీ రాగానే ఆఫ్ఘనిస్తాన్‌పై శతక్కొట్టాడు. ఇప్పుడు నంబర్‌ వన్‌ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఇషాన్‌ జర్నీ చాలా స్పూర్తిదాయకంగా ఉంది. 

Videos

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)