Breaking News

అనుకున్నదే అయ్యింది.. బీసీసీఐ కాంట్రాక్ట్‌ కోల్పోయిన ఇషాన్‌, శ్రేయస్‌

Published on Wed, 02/28/2024 - 18:16

భారత క్రికెట్‌ అభిమానులు ఊహించిందే నిజమైంది. రంజీల్లో ఆడమని ఎంత చెప్పినా వినకుండా విర్రవీగిన ఇషాన్‌ కిషన్‌, శ్రేయస్‌ అయ్యర్‌లు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ను కోల్పోయారు. తాజాగా ప్రకటించిన బోర్డు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాలో వీరిద్దరి పేర్లు గల్లంతయ్యాయి. 

ప్రస్తుతం బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ లభించిన ఆటగాళ్లలో రోహిత్‌, కోహ్లి, బుమ్రా, జడేజా ఏ ప్లస్‌ స్థానాలను నిలుపుకోగా.. బి కేటగిరి నుంచి  శ్రేయస్‌, సి కేటగిరి నుంచి ఇషాన్‌ తొలగించబడ్డారు. గతకొంతకాలంగా జట్టులో లేనప్పటికీ హార్దిక్‌ పాండ్యా ఏ గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ను నిలుపుకోగా.. కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, సిరాజ్‌లకు ప్రమోషన్‌ (బి నుంచి ఏ కేటగిరి) దక్కింది. 

యశస్వికి జాక్‌పాట్‌..
గతేడాది బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లో లేని యశస్వి జైస్వాల్‌.. ప్రస్తుత ఇంగ్లండ్‌ టెస్ట్‌ సిరీస్‌లో అత్యుత్తమంగా (వరుస డబుల్‌ సెంచరీలు) రాణించడంతో అతనికి నేరుగా బి గ్రేడ్‌ కాంట్రాక్ట్‌ దక్కింది.

కాంట్రాక్ట్‌ కోల్పోయిన వారు వీరే..
బీసీసీఐ తాజాగా ప్రకటించిన సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్ల జాబితాలో చాలా మంది పేర్లు కనపడలేదు. యుజ్వేంద్ర చహల్‌ (సి), చతేశ్వర్‌ పుజారా (బి), దీపక్‌ హుడా (సి), ఉమేశ్‌ యాదవ్‌ (సి), శిఖర్‌ ధవన్‌ (సి) బీసీసీఐ కాంట్రాక్ట్‌లు కోల్పోయారు. 

అక్షర్‌, పంత్‌లకు డిమోషన్‌ (ఏ నుంచి బి)

కొత్తగా కాంట్రాక్ట్‌ దక్కించుకున్న తిలక్‌ వర్మ, రింకూ సింగ్‌

కేటగిరి వారీగా ఆటగాళ్లకు దక్కనున్న మొత్తం..
ఏ ప్లస్‌ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు  రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.

2023-24 బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ దక్కించుకున్న ఆటగాళ్ల వివరాలు..

  • ఏ ప్లస్‌ కేటగిరి: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా 
  • ఏ కేటగిరి: అశ్విన్‌, షమీ, సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా
  • బి కేటగిరి: సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌
  • సి కేటగిరి: రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌, శార్దూల్ ఠాకూర్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్, ముఖేష్ కుమార్‌, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, కేఎస్‌ భరత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అవేష్ ఖాన్‌, రజత్‌ పాటిదార్

చదవండి: రంజీల్లో ఆడాల్సిందే.... ఆటగాళ్లకు బీసీసీఐ స్ట్రిక్ట్‌ వార్నింగ్‌

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)