Breaking News

'రోహిత్ కెప్టెన్ కాక‌పోయింటే ఎప్పుడో ప‌క్క‌న పెట్టేవారు'

Published on Thu, 08/14/2025 - 16:25

బోర్డ‌ర్ గవాస్క‌ర్ ట్రోఫీ 2024-25లో సిడ్నీ వేదిక‌గా ఆఖ‌రి టెస్టుకు అప్ప‌టి టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ దూరంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. రోహిత్ త‌న పేల‌వ ఫామ్ కార‌ణంగా త‌నంత‌ట తానే సిడ్నీ టెస్టు నుంచి వైదొలిగాడు.

కానీహెడ్ కోచ్ గౌతం గంభీర్ కావాలనే అత‌డిని జ‌ట్టు నుంచి త‌ప్పించాడ‌ని రూమ‌ర్స్ వినిపించాయి. తాజాగా ఇదే విష‌యంపై టీమిండియా మాజీ ఆల్‌రౌండ‌ర్‌, ఈ సిరీస్‌లో బ్రాడ్‌కాస్ట‌ర్ బృందంలో ఉన్న ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

రోహిత్ టెస్టు క్రికెట్‌లో ఇబ్బంది పడుతున్నప్పటికి రోహిత్‌కు బ్రాడ్‌కాస్టర్లు మద్దతుగా నిలిచారని ఇర్ఫాన్ చెప్పుకొచ్చాడు. ఒకవేళ రోహిత్ కెప్టెన్ కాకపోయింటే అతడు ఎప్పుడో జట్టులో చోటు కోల్పోయే వాడని పఠాన్ అన్నారు.

"వైట్-బాల్ క్రికెట్‌లో రోహిత్ శర్మ అద్బుతమైన ఆటగాడు. కానీ టెస్టు క్రికెట్‌లో మాత్రం క్ర‌మంగా  ఫామ్‌లో స్థిరత్వం లోపించింది. ముఖ్యంగా గ‌తేడాది అత‌డు స‌గ‌టు చాలా పేల‌వంగా ఉంది. ఒక‌వేళ రోహిత్ కెప్టెన్ కాక‌పోయింటే ఎప్పుడో టెస్టు జ‌ట్టులో త‌న స్ధానాన్ని కోల్పోయేవాడు.

రోహిత్ శ‌ర్మ‌కు మేము అవసరానికి మించి మద్దతు ఇచ్చామని చాలా మంది విమర్శించారు. మీరు ఒక‌రిని ఇంట‌ర్వ్యూకి ఆహ్వానించి వారితో త‌ప్పుగా ప్ర‌వ‌ర్తిస్తారా?  వారు ఎటువంటి స్థితిలో ఉన్న మ‌నం గౌర‌వంగా వ్య‌వ‌హ‌రించాలి. మేము కూడా ఆదే చేశాము.

ఎందుకంటే అత‌డు మా అతిథి. అత‌డికి మేము స‌పోర్ట్‌గా నిలుస్తూనే, త‌న ఫామ్‌ను మెరుగుప‌రుచుకోవాల‌ని మేము సూచించాము. కానీ అత‌డు అప్ప‌టికే తుది జ‌ట్టులో చోటుకు అన‌ర్హుడు" అని ఓ ఛాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ప‌ఠాన్ పేర్కొన్నాడు.

కాగా ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌కు ముందు రోహిత్ శ‌ర్మ టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తూ అందరికి షాకిచ్చాడు. 38 ఏళ్ల హిట్‌మ్యాన్ త‌న కెరీర్‌లో 67 మ్యాచ్‌లు ఆడి 40.57 సగటుతో 4,301 పరుగులు సాధించాడు. రోహిత్ స్ధానంలో యువ ఆట‌గాడు శుబ్‌మ‌న్ గిల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.
చదవండి: సచిన్‌కు కాబోయో కోడ‌లు సానియా ఆస్తి ఎంతో తెలుసా?
 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)