PBKS: మేనేజ్‌మెంట్‌ సరిగ్గా లేకుంటే ఎవరేం చేస్తారు?

Published on Mon, 05/13/2024 - 18:07

ఐపీఎల్‌-2024లోనూ పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది పంజాబ్‌ కింగ్స్‌. ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవని ఈ జట్టు.. ఈసారి ప్లే ఆఫ్స్‌ నుంచి నిష్క్రమించిన రెండో జట్టుగా నిలిచింది.

కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ గాయం బారిన పడటం.. కొన్ని మ్యాచ్‌లలో ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకపోవడం ప్రభావం చూపింది. ధావన్‌ స్థానంలో తాత్కాలికంగా కెప్టెన్‌ బాధ్యతలు చేపట్టిన సామ్‌ కరన్‌ ఫర్వాలేదనిపించినా.. ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో పంజాబ్‌ కేవలం నాలుగే గెలిచింది.

ఇంకో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ రెండింటిలో గెలిస్తే పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి తొమ్మిదో స్థానానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కింగ్స్‌ ప్రదర్శనపై ఆ జట్టు మాజీ కోచ్‌ టామ్‌ మూడీ విమర్శనాస్త్రాలు సంధించాడు.

‘‘మైదానం లోపలా.. వెలుపలా నాయకత్వ మార్పులే వాళ్ల పేలవ ప్రదర్శనకు కారణం. అదే నిలకడలేమి కూడా ఓ కారణం. మేనేజ్‌మెంట్‌ సరిగ్గా లేకుంటే మైదానంలోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయి’’ అని టామ్‌ మూడీ పంజాబ్‌ కింగ్స్‌ను విమర్శించాడు.

కాగా 58 ఏళ్ల టామ్‌ మూడీ 2008లో పంజాబ్‌ కోచ్‌గా పనిచేశాడు. అతడి మార్గదర్శనంలో ఆ ఏడాది జట్టు సెమీస్‌ వరకు చేరింది. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి ప్రదర్శన కనబరచడంలో విఫలమవుతోంది. 

ఇక పంజాబ్‌ను వీడిన తర్వాత 2013- 2019 వరకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు కోచ్‌గా ఉన్నాడు. 2016లో జట్టుకు టైటిల్‌ అందించాడు. ఇదిలా ఉంటే.. ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఇప్పటికే ప్లేఆఫ్స్‌ చేరింది. 

చదవండి: IPL: ధోనికి ఇదే చివరి సీజన్‌?!.. క్లారిటీ ఇచ్చేసిన రైనా
 

Videos

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)