Breaking News

IPL 2026: రేపే 'డెడ్‌లైన్‌'

Published on Thu, 11/13/2025 - 08:32

ఐపీఎల్‌ 2026 ప్రారంభానికి ఇంకా ఐదు నెలల సమయం ఉండగానే ఫ్రాంచైజీలన్నీ తీవ్ర కసరత్తు మొదలుపెట్టాయి. ఆటగాళ్ల రిటెన్షన్‌కు నవంబర్‌ 15 డెడ్‌లైన్‌ కావడంతో మార్పులు చేర్పుల విషయంలో తలమునకలై ఉన్నాయి. మరో పక్క ట్రేడ్‌ డీల్స్‌ విషయంలోనూ చర్చోపచర్చలు జోరుగా సాగుతున్నాయి.

సంజూ శాంసన్‌ రాజస్థాన్‌ రాయల్స్‌ను వీడి సీఎస్‌కేలో చేరడం.. రవీంద్ర జడేజా, సామ్‌ కర్రన్‌ సీఎస్‌కే నుంచి రాయల్స్‌కు ట్రేడ్‌ కావడం దాదాపుగా ఖరరాపోయింది. మరి కొంత మంది ఆటగాళ్ల విషయంలోనూ ట్రేడింగ్‌ జరిగే అవకాశం ఉందని ఐపీఎల్‌ వర్గాలు అంటున్నాయి.

కేఎల్‌ రాహుల్‌ కోసం కేకేఆర్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. కేకేఆర్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే, ఎస్‌ఆర్‌హెచ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ కోసం ముంబై ఇండియన్స్‌ ట్రై చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. గుజరాత్‌ టైటాన్స్‌ సైతం ఓ కీలక ఆటగాడిని ట్రేడ్‌ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.

రిటెన్షన్‌ ప్రక్రియ పూర్తయ్యాక, ఫ్రాంచైజీలు వేలంపై దృష్టి సారిస్తాయి. వేలంలో ఎవరెవరిని తీసుకోవాలో ఇప్పటి నుంచే ఓ ప్లాన్‌ వేసుకుంటున్నాయి. లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఆల్‌రౌండర్‌ శార్దూల్‌ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్‌ దక్కించుకోవాలని పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తుంది. అర్జున్‌ టెండూల్కర్‌ కోసం లక్నో సూపర్‌ జెయింట్స్‌ యత్నిస్తున్నట్లు సమాచారం​.

ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాడి కోసం ప్రయత్నించే అవకాశం ఉందన్న విషయంపై  క్లారిటీ రావాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

కాగా, ఐపీఎల్‌ 2026 సీజన్‌ మార్చి 15 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌లో మొత్తం 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మెగా టోర్నీ మే 31న జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది. మినీ వేలం డిసెంబర్ 15 లేదా 16 తేదీల్లో జరిగే అవకాశం ఉంది.

చదవండి: హార్దిక్‌ పాండ్యా కీలక నిర్ణయం

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)