Breaking News

ప్లాన్‌ ప్రకారం చేస్తున్నారు: ఇషాన్‌ కిషన్‌

Published on Sun, 04/19/2026 - 07:45

ఐపీఎల్‌ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కేపై సన్‌రైజర్స్‌ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను బౌలర్లు గెలిపించారు. తొలుత బ్యాటింగ్‌ చేసి 194 పరుగులు చేసిన సన్‌రైజర్స్‌, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఎషాన్‌ మలింగ (4-0-29-3), నితీశ్‌ కుమార్‌ రెడ్డి (4-0-31-2), సాకిబ్‌ హుస్సేన్‌ (4-0-32-1), శివాంగ్‌ కుమార్‌ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్‌ చేసి సీఎస్‌కేను గెలుపును అడ్డుకున్నారు.

మ్యాచ్‌ అనంతరం ఎస్‌ఆర్‌హెచ్‌ కెప్టెన్‌ ఇషాన్‌ కిషన్‌ తమ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్‌ మాటల్లో..

యువ బౌలర్లు ప్లాన్‌ ప్రకారం బౌలింగ్‌ చేస్తున్నారు. వారు తమ ప్లాన్‌లను అమలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారు స్వయంగా ప్లాన్‌లు తయారు చేసుకోవడంతో కెప్టెన్‌గా ఫీల్డ్‌ సెట్‌ చేయడంలో ఒత్తిడి తగ్గింది. ప్రాక్టీస్‌ సెషన్స్‌లో వారు కష్టపడి మెరుగుపడుతున్నారు. అందుకే వారిపై పూర్తి నమ్మకం ఉంచి ఫ్రీ హ్యాండ్‌ ఇస్తున్నాము.

బ్యాటింగ్‌లో లోటుపై మాట్లాడుతూ.. అభిషేక్‌ శర్మ త్వరగా ఔట్‌ కావడంతో 20–30 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. సాధారణంగా మా టాప్‌-3లో ఒకరు పెద్ద స్కోరు చేస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో అది జరగలేదు. పిచ్‌ బ్యాటింగ్‌ ఫ్రెండ్లీగా ఉండింది. కాబట్టి 220–230 పరుగులు చేసి ఉండవచ్చు.

పాయింట్స్‌ టేబుల్‌పై మాట్లాడుతూ.. మేము పాయింట్స్‌ టేబుల్‌ గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీమెంట్‌. ఏ మ్యాచ్‌కు ఆ మ్యాచ్‌ను టార్గెట్‌గా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాము. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ, అగ్రెసివ్‌గా ఆడటమే మా కర్తవ్యం.

ఇషాన్‌ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే బ్యాటింగ్‌లో మరిన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశం​ బయటపడింది. మొత్తంగా జట్టు ప్రదర్శన పట్ల ఇషాన్‌ సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపు తర్వాత సన్‌రైజర్స్‌ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానాని​​కి ఎగబాకింది. ఏప్రిల్‌ 21న జరిగే తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌ కూడా ఎస్‌ఆర్‌హెచ్‌ సొంత మైదానం హైదరాబాద్‌లోనే జరుగనుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)