Breaking News

నేడు ఐపీఎల్‌–2026 ‘మినీ’ వేలం.. 77 స్థానాలు.. 359 మంది ఆటగాళ్లు

Published on Tue, 12/16/2025 - 02:11

అబుదాబి: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)–2026కు సంబంధించి మినీ వేలానికి రంగం సిద్ధమైంది. తమ జట్టులో మిగిలిన స్థానాలు పూరించుకునేందుకు లీగ్‌లో 10 జట్లు పోటీ పడనున్నాయి. అబుదాబి వేదికగా నేడు జరిగే ఈ వేలంలో మొత్తం 77 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 359 క్రికెటర్లు వేలానికి అందుబాటులో ఉండగా... ఖాళీల్లో గరిష్టంగా 31 మంది విదేశీ ఆటగాళ్ళను తీసుకునేందుకు అవకాశం ఉంది. వేలం మంగళవారం ఒక్కరోజు మాత్రమే జరుగుతుంది. 

అన్ని జట్లలోకి గరిష్టంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ వద్ద అత్యధికంగా రూ.64.30 కోట్లు ఉండగా, వారికే అందరికంటే ఎక్కువగా 13 మంది ఆటగాళ్ల అవసరం ఉంది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో 10 ఖాళీలు ఉండగా, చేతిలో మొత్తం రూ. 25.50 కోట్లు ఉన్నాయి. అత్యధిక కనీస ధర రూ.2 కోట్లతో ఏకంగా 40 మంది క్రికెటర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు. వీరిలో ఎంత మంది విలువ పైపైకి వెళుతుందనేది ఆసక్తికరం. 

అయితే విదేశీ ఆటగాడికి ఎవరికైనా గరిష్టంగా రూ. 18 కోట్లు మాత్రమే దక్కుతాయి. వేలంలో అంతకంటే ఎక్కువ మొత్తానికి అతడిని సొంతం చేసుకున్నా... ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఆటగాళ్ల గరిష్ట రిటెన్షన్‌ విలువ (రూ.18 కోట్లు), మెగా వేలంలో ఒక ఆటగాడికి దక్కిన మొత్తం (పంత్‌కు రూ. 27 కోట్లు)కంటే ఇది ఎక్కువగా ఉండరాదు. వేలంలో అంతకంటే ఎక్కువగా వచ్చినా మిగిలిన మొత్తం బీసీసీఐకే వెళుతుంది.  

గ్రీన్‌పై భారీ అంచనాలు! 
మినీ వేలంలో కొందరు ఆటగాళ్లపై ప్రధానంగా అందరి దృష్టీ నిలిచింది. ఆ్రస్టేలియా ఆల్‌రౌండర్‌ కామెరాన్‌ గ్రీన్‌కు అందరికంటే ఎక్కువ విలువ పలికే అవకాశం కనిపిస్తోంది. 2023లో ముంబై ఇండియన్స్‌ తరఫున చక్కటి ప్రదర్శన కనబర్చిన గ్రీన్‌... 2024లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు తరఫున ఫర్వాలేదనిపించాడు. గాయం కారణంగా గత సీజన్‌కు అతను దూరమయ్యాడు. 

రసెల్‌ రిటైర్‌ రావడంతో కేకేఆర్‌కు అలాంటి ఆటగాడి అవసరం ఉండగా, మిడిలార్డర్‌లో ఆల్‌రౌండర్‌ కోసం చెన్నై చూస్తోంది. భారీ హిట్టర్, గత ఏడాది ఆర్‌సీబీ విజయంలో కీలక పాత్ర పోషించిన లివింగ్‌స్టోన్‌ కూడా ఎక్కువ మొత్తం ఆకర్షించవచ్చు. ఇతర విదేశీ ఆటగాళ్లలో డికాక్, పతిరణ, జేమీ స్మిత్‌పై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపిస్తున్నారు. 

కాన్వే, మిల్లర్, హసరంగ, ముల్డర్, నోర్జే తదితరులు కూడా వేలంలో అందుబాటులో ఉన్నారు. భారత క్రికెటర్లలో లెగ్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌ పెద్ద మొత్తం అందుకోవచ్చు. వెంకటేశ్‌ అయ్యర్, సర్ఫరాజ్‌ ఖాన్, దీపక్‌ హుడా, ఆకాశ్‌దీప్, రాహుల్‌ చహర్‌ తదితరులు వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. గత ఏడాది వరకు ఐపీఎల్‌లో తమదైన ముద్ర వేసిన మ్యాక్స్‌వెల్, డుప్లెసిస్‌ ఈసారి వేలానికి అందుబాటులోకి లేకపోగా, రసెల్‌ ఆటగాడిగా రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  

 

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)