Breaking News

శ్రేయస్‌ అయ్యర్‌కు మరో చేదు అనుభవం

Published on Fri, 06/13/2025 - 07:33

కెప్టెన్‌గా శ్రేయస్‌ అ‍య్యర్‌కు ఒకే నెలలో వరుసగా రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. జూన్‌ 3న అతని సారథ్యంలోని పంజాబ్‌ కింగ్స్‌ ఐపీఎల్‌ 2025 ఫైనల్లో ఆర్సీబీ చేతిలో పరాజయం పాలైంది. పది రోజులు తిరక్కుండానే జూన్‌ 12న అతని కెప్టెన్సీలోని మరో జట్టు ఫైనల్లో ఓటమిని ఎదుర్కొంది.

నిన్న జరిగిన ముంబై టీ20 లీగ్‌ ఫైనల్లో శ్రేయస్‌ నేతృత్వం వహించిన సోబో ముంబై ఫాల్కన్స్‌.. ముంబై సౌత్‌ సెంట్రల్‌ మరాఠా రాయల్స్‌ చేతిలో 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన శ్రేయస్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేయగా.. ప్రత్యర్ధి టీమ్‌ మరో నాలుగు బంతులు మిగిలుండగానే 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో శ్రేయస్‌ ఆటగాడిగానూ విఫలమయ్యాడు. 17 బంతులు ఆడి బౌండరీలు, సిక్సర్లు లేకుండా 12 పరుగులు మాత్రమే చేశాడు. అతని జట్టులో మయూరేశ్‌ తండేల్‌ (50) అజేయ అర్ద సెంచరీతో రాణించగా.. హర్ష్‌ గర్వ్‌ (28 బంతుల్లో 45 నాటౌట్‌; ఫోర్‌, 4 సిక్సర్లు) ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. 

అంగ్‌క్రిష్‌ రఘువంశీ 7, ఇషాన్‌ ముల్చందని 20, అమోఘ్‌ భత్కల్‌ 16 పరుగులు చేశారు. రాయల్స్‌ బౌలర్లలో వైభవ్‌ మాలీ 2, ఆదిత్య ధుమాల్‌, మ్యాక్స్‌వెల్‌ స్వామినాథన్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

రాయల్స్‌ ఇన్నింగ్స్‌లో చిన్మయ్‌ రాజేశ్‌ సుతార్‌ (53) అర్ద సెంచరీతో రాణించగా.. అవైస్‌ ఖాన్‌ నౌషద్‌ 38, సాహిల్‌ భగవంతా జాదవ్‌ 22, సిద్దేశ్‌ లాడ్‌ 15, సచిన్‌ యాదవ్‌ 19, రోహన్‌ రాజే 8 (నాటౌట్‌) పరుగులు చేశారు. శ్రేయస్‌ జట్టు బౌలర్లలో కార్తీక్‌ మిశ్రా, యశ్‌ దిచోల్కర్‌ తలో రెండు వికెట్లు తీశారు. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా చిన్మయ్‌ రాజేశ్‌ సుతార్‌ ఎంపిక కాగా.. ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డును సాయిరాజ్‌ పాటిల్‌ గెలుచుకున్నాడు. 

కెప్టెన్‌గా శ్రేయస్‌ రికార్డు
ఐపీఎల్‌ 2024లో కేకేఆర్‌ను విజేతగా నిలిపాడు
2024లో ముంబైకి సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ అందించాడు
ఐపీఎల్‌ 2019లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్‌)
ఐపీఎల్‌ 2024లో పంజాబ్‌ కింగ్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్‌)
ముంబై టీ20 లీగ్‌ 2025లో సోబో ముంబై ఫాల్కన్స్‌ను ఫైనల్స్‌కు చేర్చాడు (రన్నరప్‌)

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)