Breaking News

IPL 2025: షేన్‌ వార్న్‌ రికార్డును బద్దలు కొట్టిన సంజూ శాంసన్‌

Published on Sun, 04/06/2025 - 10:19

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో భాగంగా నిన్న (ఏప్రిల్‌ 5) రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో రాయల్స్‌ 50 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. రెండు వరుస విజయాల తర్వాత పంజాబ్‌కు ఈ సీజన్‌లో ఇది తొలి ఓటమి కాగా.. రెండు వరుస పరాజయాల తర్వాత రాయల్స్‌కు ఇది వరుసగా రెండో విజయం.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన రాయల్స్‌.. యశస్వి జైస్వాల్‌ (45 బంతుల్లో 67; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), సంజూ శాంసన్‌ (26 బంతుల్లో 38; 6 ఫోర్లు), రియాన్‌ పరాగ్‌ (25 బంతుల్లో 43 నాటౌట్‌; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. 

నితీశ్‌ రాణా 7 బంతుల్లో 12, హైట్‌మైర్‌ 12 బంతుల్లో 20, ధృవ్‌ జురెల్‌ 5 బంతుల్లో 13 (నాటౌట్‌) పరుగులు చేశారు. పంజాబ్‌ బౌలర్లలో ఫెర్గూసన్‌ 2, అర్షదీప్‌ సింగ్‌, జన్సెన్‌ తలో వికెట్‌ తీశారు. ఈ సీజన్‌లో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విఫలమైన జైస్వాల్‌.. ఈ మ్యాచ్‌లో బాధ్యతాయుతమైన హాఫ్‌ సెంచరీతో ఆకట్టుకున్నాడు.

అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్‌.. జోఫ్రా ఆర్చర్‌ (4-0-25-3), సందీప్‌ శర్మ (4-0-21-2), మహీశ్‌ తీక్షణ (4-0-26-2) రెచ్చిపోవడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 155 పరుగులు మాత్ర​మే చేయగలిగింది. తొలి ఓవర్‌లో ఆర్చర్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి మొదటి బంతికే ప్రియాంశ్‌ ఆర్య (0), ఓవర్‌ చివరి బంతికి శ్రేయస్‌ అయ్యర్‌ను (10) క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. 

ఆతర్వాత కూడా రాయల్స్‌ బౌలర్లు చెలరేగిపోయారు. ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ను (17) కుమార్‌ కార్తికేయ.. స్లోయినిస్‌ను (1) సందీప్‌ శర్మ పెవిలియన్‌కు పంపారు. తద్వారా పంజాబ్‌ 43 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో నేహల్‌ వధేరా (41 బంతుల్లో 62; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (21 బంతుల్లో 30; 3 ఫోర్లు, సిక్స్‌) పంజాబ్‌ను గట్టెక్కించే ప్రయత్నం చేశారు. 

అయితే మ్యాక్సీ, వధేరా వరుస బంతుల్లో (15వ ఓవర్‌ చివరి బంతికి, 16వ ఓవర్‌ మొదటి బంతికి) ఔట్‌ కావడంతో పంజాబ్‌ ఓటమి ఖరారైపోయింది. క్రీజ్‌లో కుదురుకున్న​ వధేరాను హసరంగ ఔట్‌ చేయగా.. మ్యాక్స్‌వెల్‌ను తీక్షణ బోల్తా కొట్టించాడు. ఆఖర్లో వచ్చిన శశాంక్‌ సింగ్‌ (13 బంతుల్లో 10 నాటౌట్‌), సూర్యాంశ్‌ షేడ్గే (2), జన్సెన్‌ (3), అర్షదీప్‌ (1), ఫెర్గూసన్‌ (4 నాటౌట్‌) ప్రభావ​ం చూపలేకపోయారు. ఫలితంగా పంజాబ్‌ లక్ష్యానికి 51 పరుగుల దూరంలో నిలిచిపోయింది.

షేన్‌ వార్న్‌ రికార్డును బద్దలు కొట్టిన శాంసన్‌
ఈ మ్యాచ్‌లో గెలుపుతో రాయల్స్‌ కెప్టెన్‌ సంజూ శాంసన్‌ ఓ భారీ రికార్డును తన ఖతాలో వేసుకున్నాడు. రాయల్స్‌ను అత్యధిక మ్యాచ్‌ల్లో గెలిపించిన కెప్టెన్‌గా షేన్‌ వార్న్‌ రికార్డును బద్దలు కొట్టాడు. వార్న్‌ 31 మ్యాచ్‌ల్లో (55 మ్యాచ్‌ల్లో) రాయల్స్‌ను గెలిపించగా.. తాజా గెలుపుతో శాంసన్‌ 32 సార్లు (62 మ్యాచ్‌ల్లో) రాయల్స్‌ను విజయపథాన నడిపించాడు. తద్వారా ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన రాజస్థాన్‌ రాయల్స్‌ కెప్టెన్‌గా అవతరించాడు.

రాయల్స్‌ కెప్టెన్‌గా అత్యధిక విజయాలు..
32 - సంజూ శాంసన్ (62 మ్యాచులు)*
31 - షేన్ వార్న్ (55 మ్యాచులు)
18 - రాహుల్ ద్రవిడ్ (34 మ్యాచులు)
15 - స్టీవెన్ స్మిత్ (27 మ్యాచులు)
9 - అజింక్య రహానే (24 మ్యాచులు)

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)