Breaking News

RR VS GT: ఓ పక్క వైభవ్‌ విధ్వంసకాండ కొనసాగుతుండగా, జైస్వాల్‌ రికార్డుల్లోకెక్కాడు

Published on Tue, 04/29/2025 - 10:15

ఐపీఎల్‌ 2025లో నిన్న (ఏప్రిల్‌ 28) గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ కుర్రాడు వైభవ్‌ సూర్యవంశీ విధ్వంసకర శతకంతో (35 బంతుల్లో) విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో వైభవ్‌ విధ్వంసకాండ ఓ పక్క కొనసాగుతుండగానే రాయల్స్‌ మరో ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ రికార్డుల్లోకెక్కాడు.

ఈ మ్యాచ్‌లో 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో అజేయమైన 70 పరుగులు చేసిన జైస్వాల్‌.. రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చడంతో పాటు ఆ జట్టు తరఫున 2000 పరుగులు పూర్తి చేసిన మూడో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా ఐదో ప్లేయర్‌గా, ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఐదో బ్యాటర్‌గా, రాజస్థాన్‌ తరఫున అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు.  

ఐపీఎల్‌ అరంగేట్రం నుంచి (2020) రాజస్థాన్‌ రాయల్స్‌కే ఆడుతున్న జైస్వాల్‌.. 62 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీలు, 14 హాఫ్‌ సెంచరీల సాయంతో 2000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు ముందు రాయల్స్‌ తరఫున సంజూ శాంసన్‌ (3966), జోస్‌ బట్లర్‌ (3055), అజింక్య రహానే (2810), షేన్‌ వాట్సన్‌ (2372) 2000 పరుగులు పూర్తి చేశారు.

ఐపీఎల్‌లో అత్యంత వేగంగా 2000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్లు
క్రిస్‌ గేల్‌- 48 ఇన్నింగ్స్‌ల్లో
షాన్‌ మార్ష్‌- 52
రుతురాజ్‌ గైక్వాడ్‌- 57
కేఎల్‌ రాహుల్‌- 60
యశస్వి జైస్వాల్‌- 62

మ్యాచ్‌ విషయానికొస్తే.. గుజరాత్‌ నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో వైభవ్‌ సూర్యవంశీ (38 బంతుల్లో 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు) సునామీ శతకంతో విరుచుకుపడటంతో రాయల్స్‌ 15.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఓ పక్క వైభవ్‌ విధ్వంసకాండ కొనసాగుతుండగానే జైస్వాల్‌ తన సహజ శైలిలో చెలరేగుతూ రాయల్స్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఆఖర్లో రియాన్‌ పరాగ్‌ (15 బంతుల్లో 32 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు.

అంతకుముందు  శుభ్‌మన్‌ గిల్‌ (50 బంతుల్లో 84; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), జోస్‌ బట్లర్‌ (26 బంతుల్లో​ 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు‌), సాయి సుదర్శన్‌ (30 బంతుల్లో 39; 4 ఫోర్లు, సిక్స్‌) సత్తా చాటడంతో గుజరాత్‌ 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది.

 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)