Breaking News

శ్రేయస్‌ అయ్యర్‌పై కనకవర్షం.. ఐపీఎల్‌ చరిత్రలో తొలిసారి! కానీ..

Published on Sun, 11/24/2024 - 16:19

మెగా వేలం-2025లో టీమిండియా మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ కోసం ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు ఎగబడ్డాయి. రూ. 2 కోట్ల కనీస ధరకు ఆక్షన్‌లోకి వచ్చిన ఈ ముంబై బ్యాటర్‌ను దక్కించుకునేందుకు పాత జట్టు కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ పోటీకి రాగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌ తగ్గేదేలే అన్నట్లు రేసులో మున్ముందుకు దూసుకుపోయాయి.

నువ్వా- నేనా అన్నట్లు ఢిల్లీ, పంజాబ్‌ తలపడటంతో శ్రేయస్‌ అయ్యర్‌ ధర రూ. 20 కోట్లు దాటింది. దీంతో కోల్‌కతా పోటీ నుంచి తప్పుకోగా.. సరైన కెప్టెన్లు లేని కారణంగా ఢిల్లీ, పంజాబ్‌ మాత్రం అయ్యర్‌ ధరను అంతకంతకూ పెంచుతూ పోయాయి. 

ఆఖరికి ఢిల్లీ వెనక్కి తగ్గగా.. రూ. 26.75 కోట్లకు పంజాబ్‌ తమ సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అయ్యర్‌ చరిత్ర సృష్టించాడు.  అంతకు ముందు మొదటి ప్లేయర్‌గా వేలంలోకి వచ్చిన మరో టీమిండియా స్టార్‌, పేస్‌ బౌలర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ను కూడా పంజాబ్‌ భారీ ధరకు సొంతం చేసుకుంది.

కెప్టెన్‌ కోసం..
ఐపీఎల్‌-2024లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను చాంపియన్‌గా నిలిపిన ఘనత శ్రేయస్‌ అయ్యర్‌ సొంతం. అయినప్పటికీ కోల్‌కతా రిటెన్షన్‌కు ముందు అతడిని వదిలేసింది. దీంతో అతడు మెగా వేలంలోకి హాట్‌కేకు అవుతాడని అంతా ముందే ఊహించారు. 

అందుకు తగ్గట్లుగానే అయ్యర్‌ భారీ ధర పలకడం విశేషం. కాగా పంజాబ్‌ ఇంత వరకు ఒక్కసారి కూడా టైటిల్‌ గెలవలేదు. అంతేకాదు వేలానికి ముందు కేవలం ఇద్దరిని రిటైన్‌ చేసుకుని అందరినీ విడిచిపెట్టింది.

దీంతో రూ. 110.5 కోట్ల పర్సు వాల్యూతో వేలంలోకి వచ్చింది. దీంతో అయ్యర్‌ కోసం ఈ మేర ఖర్చు చేసింది. అయితే, పంత్‌ను లక్నో రూ. 27 కోట్లకు కొనడంతో అయ్యర్‌ రికార్డు బ్రేక్‌ అయింది.కాగా ఐపీఎల్‌లో శ్రేయస్‌ అయ్యర్‌ ఇప్పటి వరకు 115 మ్యాచ్‌లు ఆడి.. 3127 పరుగులు చేశాడు.

చదవండి: Rishabh Pant: అయ్యర్‌ రికార్డు బ్రేక్‌.. కోట్లు కొల్లగొట్టిన పంత్‌! లక్నో సొంతం

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)