Breaking News

RCB VS PBKS Qualifier-1: అలా జరిగితే గెలవకపోయినా పంజాబ్‌ ఫైనల్‌కు చేరుతుంది..!

Published on Wed, 05/28/2025 - 16:00

ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌లో లీగ్‌ దశ మ్యాచ్‌లన్నీ ముగిశాయి. పంజాబ్‌, ఆర్సీబీ, గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించాయి. మే 29న జరిగే క్వాలిఫయర్‌-1లో ఆర్సీబీ, పంజాబ్‌ తలపడతాయి. మే 30న జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో గుజరాత్‌, ముంబై ఇండియన్స్‌ అమీతుమీ తేల్చుకుంటాయి.  

లీగ్‌ దశలో సాధించిన విజయాలు, నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా ప్లే ఆఫ్స్‌ బెర్త్‌లు ఖరారయ్యాయి. పంజాబ్‌, ఆర్సీబీ తలో 14 మ్యాచ్‌ల్లో చెరో 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచాయి. పాయింట్లు సమంగా (19) ఉన్నా, ఆర్సీబీతో పోలిస్తే నెట్‌ రన్‌రేట్‌ మెరుగ్గా ఉండటంతో పంజాబ్‌కు తొలి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌ దక్కింది.

గుజరాత్‌ 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, ముంబై ఇండియన్స్‌ 14 మ్యాచ్‌ల్లో 8 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. గుజరాత్‌ కూడా పంజాబ్‌, ఆర్సీబీ మాదిరి 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు సాధించినా.. పంజాబ్‌, ఆర్సీబీ ఆడాల్సిన ఓ మ్యాచ్‌ (వేర్వేరుగా) రద్దైంది. దీంతో పంజాబ్‌, ఆర్సీబీలకు అదనంగా తలో పాయింట్‌ లభించింది.

ప్లే ఆఫ్స్‌ మ్యాచ్‌లు ఎలా..?
పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు (పంజాబ్‌, ఆర్సీబీ) మొదటి క్వాలిఫయర్‌లో తలపడతాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరుతుంది. ఈ మ్యాచ్‌లో ఓడిన జట్టుకు మరో ఛాన్స్‌ ఉంటుంది. క్వాలిఫయర్‌-2లో (జూన్‌ 1) పోటీ పడే అవకాశం దక్కుతుంది. 

క్వాలిఫయర్‌-2లో ఇంకో బెర్త్‌ ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ద్వారా తెలుస్తుంది. పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచే జట్లు ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో తలపడతాయి. గెలిచిన జట్టు క్వాలిఫయర్‌-2లో పోటీ పడాల్సి ఉంటుంది. ఎలిమినేటర్‌లో ఓడిన జట్టు ఇంటి ముఖం పడుతుంది. క్వాలిఫయర్‌-2లో గెలిచే జట్టు.. క్వాలిఫయర్‌-1లో గెలిచే జట్టుతో ఫైనల్‌లో (జూన్‌ 3) తలపడుతుంది.

ఆర్సీబీ, పంజాబ్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ రద్దైతే..?
పంజాబ్‌, ఆర్సీబీ మధ్య మే 29న జరగాల్సిన క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ ఏ కారణంగా అయినా రద్దైతే పంజాబ్‌ ఫైనల్‌కు చేరుతుంది. పాయింట్ల పట్టికలో పంజాబ్‌ అగ్రస్థానంలో ఉంది కాబట్టి, ఆ జట్టుకు ఈ అవకాశం దక్కుతుంది. షెడ్యూల్‌ ప్రకారం క్వాలిఫయర్‌-1కు రిజర్వ్‌ డే లేదు. 

కాబట్టి తప్పనిసరిగా మ్యాచ్‌ జరిగి గెలిస్తేనే ఆర్సీబీ ఫైనల్‌కు చేరుతుంది. పంజాబ్‌కు అలా కాదు. ఏ కారణంగా అయినా మ్యాచ్‌ రద్దైనా ఆ జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఏ కారణంగా కూడా పంజాబ్‌, ఆర్సీబీ క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం లేదు.

 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)