Breaking News

RR VS MI: బుమ్రా, బౌల్ట్‌ లాంటి హేమాహేమీల ముందు కుర్ర వైభవ్‌ ఆటలు సాగుతాయా..?

Published on Thu, 05/01/2025 - 17:22

ఐపీఎల్‌ 2025లో ఇవాళ (మే 1) రాజస్థాన్‌ రాయల్స్‌, ముంబై ఇండియన్స్‌ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ రాయల్స్‌ హోం గ్రౌండ్‌ సువాయ్‌ మాన్‌ సింగ్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు అందరి దృష్టి రాయల్స్‌ చిచ్చరపిడుగు వైభవ్‌ సూర్యవంశీపైనే ఉంది. ముంబై ఇండియన్స్‌పై వైభవ్‌ ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పటిష్టమైన ముంబై బౌలింగ్‌ లైనప్‌ను 14 ఏళ్ల కుర్ర వైభవ్‌ ఎలా హ్యాండిల్‌ చేస్తాడో అని చర్చించుకుంటున్నారు.

ప్రపంచంలోనే అరివీర భయంకరులైన బుమ్రా, బౌల్ట్ ముందు నిలబడగలడా అని సందేహిస్తున్నారు. వైభవ్‌ జోరు చూస్తే బుమ్రా, బౌల్ట్‌కు కూడా బడిత పూజ తప్పదని అనిపిస్తుంది. ఊహకందని శతకంతో రాత్రికిరాత్రి హీరో అయిపోయిన వైభవ్‌ దుర్భేధ్యమైన ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ను ఎలా ఎదుర్కోగలడో చూడాలి మరి.

14 ఏళ్ల  వైభవ్‌ సూర్యవంశీ రెండు రోజుల కిందట గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ కొట్టి యావత్‌ క్రికెట్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ విధ్వంసకర ప్రదర్శనతో వైభవ్‌ ఓవర్‌ నైట్‌ స్టార్‌గా మారిపోయాడు. అతడిపై అంచనాలు ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తు పెరిగాయి. ఒక్క ఇన్నింగ్స్‌తోనే క్రికెట్‌ ప్రపంచం మొత్తాన్ని తనవైపు తిప్పుకున్న ఈ బేబీ బాస్‌.. నేడు ముంబైతో జరుగబోయే మ్యాచ్‌లో కూడా సత్తా చాటాలని కోరుకుందాం. 

వైభవ్‌ తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఇప్పటివరకు 3 మ్యాచ్‌లు ఆడి 215.72 స్ట్రయిక్‌ రేట్‌తో 151 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో 38 బంతులు ఎదుర్కొన్న వైభవ్‌.. 7 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 101 పరుగులు చేశాడు. అంతకుముందు ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 2 సిక్సర్ల సాయంతో 16 పరుగులు చేశాడు. తొలి మ్యాచ్‌లో (లక్నో) కూడా వైభవ్‌ చిన్నపాటి విధ్వంసమే సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 34 పరుగులు చేశాడు.

ఇదిలా ఉంటే, ప్లే ఆఫ్స్‌ రేసులో నిలవాలంటే ముంబై ఇండియన్స్‌పై రాయల్స్‌ తప్పక గెలవాలి. ఈ మ్యాచ్‌లో ఓడితే రాయల్స్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలు దాదాపుగా గల్లంతైనట్లే. మరోవైపు ముంబై ఇండియన్స్‌కు కూడా ఈ మ్యాచ్‌ కీలకమే. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్లే ఆఫ్స్‌ బెర్త్‌పై ఖర్చీఫ్‌ వేసుకోవాలని ముంబై ఇండియన్స్‌ భావిస్తుంది. ప్రస్తుతం ముంబై 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. రాయల్స్‌ 10 మ్యాచ్‌ల్లో మూడే విజయాలతో చివరి నుం‍చి మూడో స్థానంలో ఉంది. 

తుది జట్లు (అంచనా)..
రాజస్థాన్‌ రాయల్స్‌: వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్ (c), ధృవ్ జురెల్ (wk), షిమ్రోన్ హెట్మెయర్, వనిందు హసరంగా, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఆకాష్ మధ్వల్/శుభమ్ దూబే

ముంబై ఇండియన్స్‌: ర్యాన్ రికిల్టన్ (wk), రోహిత్ శర్మ (c), విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, కార్బిన్ బాష్, దీపక్ చాహర్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా
 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)