Breaking News

ఢిల్లీ క్యాపిటల్స్‌ కోచ్‌కు భారీ షాకిచ్చిన బీసీసీఐ!

Published on Thu, 04/17/2025 - 13:40

గెలుపు జోష్‌లో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆ టీమ్‌ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌ (Munaf Patel)కు ఐపీఎల్‌ పాలక మండలి జరిమానా విధించింది. అంతేకాదు.. అతడి ఖాతాలో ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జతచేసింది. రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా మునాఫ్‌ పటేల్‌ అనుచిత ప్రవర్తనకు గానూ భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు శిక్ష విధించింది.

మ్యాచ్‌ ‘టై’.. ఫలితం తేల్చేందుకు
అసలేం జరిగిందంటే.. ఐపీఎల్‌-2025 (IPL 2025)లో భాగంగా ఢిల్లీ సొంత మైదానంలో బుధవారం రాజస్తాన్‌ రాయల్స్‌తో తలపడింది. అరుణ్‌జైట్లీ స్టేడియంలో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన అక్షర్‌ సేన.. నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది.

సూపర్‌ ఓవర్‌లో గెలిచిన ఢిల్లీ
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన రాజస్తాన్‌ రాయల్స్‌ కూడా 20 ఓవర్ల పూర్తయ్యేసరికి నాలుగు వికెట్లు కోల్పోయి.. 188 పరుగులే చేసింది. ఫలితంగా మ్యాచ్‌ ‘టై’ కావడంతో అంపైర్లు సూపర్‌ ఓవర్‌ నిర్వహించారు. ఇందులో భాగంగా తొలుత బ్యాటింగ్‌ చేసిన రాజస్తాన్‌ ఐదు బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 11 పరుగులు చేయగా.. ఢిల్లీ (2, 4, 1, 6) నాలుగు బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించింది.

పట్టికలో అగ్రస్థానానికి
ఈ నేపథ్యంలో రాజస్తాన్‌ రాయల్స్‌పై గెలుపొందడంతో పాటు.. సీజన్‌లో ఐదో విజయం అందుకుని పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే.. ఢిల్లీ- రాజస్తాన్‌ జట్ల మధ్య సూపర్‌ ఓవర్‌ సమయంలో ఢిల్లీ బౌలింగ్‌ కోచ్‌ మునాఫ్‌ పటేల్‌ ఫోర్త్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు.

అంపైర్‌తో వాగ్వాదం
బౌండరీ లైన్‌ వద్ద ఫోర్త్‌ అంపైర్‌ నిల్చుని ఉండగా.. అక్కడే కూర్చుని ఉన్న మునాఫ్‌ పటేల్‌ అతడితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగాడు. మైదానంలో ఉన్న తమ ఆటగాళ్లకు సందేశం చేరవేసేందుకు వేరే ఆటగాడిని పంపాలని భావించగా.. ఫోర్త్‌ అంపైర్‌ అందుకు నిరాకరించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే అతడితో మునాఫ్‌ వాదనకు దిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

జరిమానాతో పాటు
ఈ క్రమంలో ఐపీఎల్‌ పాలక మండలి మునాఫ్‌ పటేల్‌కు జరిమానా విధిస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అంపైర్‌తో అనుచితంగా ప్రవర్తించిన కారణంగా అతడి మ్యాచ్‌ ఫీజులో 25 శాతం మేర కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్‌ పాయింట్‌ కూడా జతచేసినట్లు వెల్లడించింది. ఐపీఎల్‌ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్‌ 2.20 నిబంధనను అతడు ఉల్లంఘించిన కారణంగా ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.

కాగా మునాఫ్‌ పటేల్‌ మార్గదర్శనంలో ఢిల్లీ బౌలింగ్‌ విభాగం రాణిస్తోంది. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూ జట్టును అగ్రస్థానంలో నిలపడంలో బౌలర్లు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. కాగా రాజస్తాన్‌ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌ను కట్టుదిట్టంగా వేసి.. మ్యాచ్‌ టై కావడానికి ప్రధాన కారణమైన పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌.. సూపర్‌ ఓవర్‌లోనూ అద్భుతం చేసి ఢిల్లీని గెలిపించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు.

చదవండి: Rohit Sharma: కమిన్స్‌, స్టార్క్‌ కాదు!.. అతడిని ఎదుర్కోవడమే అత్యంత కష్టం

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)