Breaking News

ఐపీఎల్ రీ షెడ్యూల్ ప్రకటన...

Published on Tue, 05/13/2025 - 00:06

న్యూఢిల్లీ: భారత్, పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలతో వాయిదా పడిన ఐపీఎల్‌ 18వ సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ఈ నెల 17 నుంచి తిరిగి నిర్వహించనున్నట్లు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. కేంద్ర ప్రభుత్వం, పోలీసు సిబ్బంది, ప్రైవేట్‌ సెక్యూరిటీ ఏజెన్సీలు, లీగ్‌ భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరిపిన బోర్డు మిగిలి పోయిన 17 మ్యాచ్‌ల్ని ఆరు వేదికలు బెంగళూరు, జైపూర్, న్యూఢిల్లీ, లక్నో, ముంబై, అహ్మదాబాద్‌లలో నిర్వహిస్తామని ప్రకటించింది. మే 17 నుంచి 27 వరకు లీగ్‌ మ్యాచ్‌లు జరుగుతాయి. 

ఇందులో రెండు ఆదివారాలు రాగా రెండేసి మ్యాచ్‌లు (డబుల్‌ హెడర్‌) నిర్వహిస్తారు. 29న తొలి క్వాలిఫయర్, 30న ఎలిమినేటర్, 1న రెండో క్వాలిఫయర్, 3న ఫైనల్‌తో ఈ సీజన్‌ ఐపీఎల్‌ ముగుస్తుంది. ‘ప్లేఆఫ్స్‌’ మ్యాచ్‌ వేదికల్ని తర్వాత ప్రకటిస్తారు. కాగా ఈ నెల 10న హైదరాబాద్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరగాల్సిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆఖరి పోరును 25వ తేదీన న్యూఢిల్లీలో ఏర్పాటు చేశారు. ఈనెల 8న ధర్మశాలలో అర్ధాంతరంగా ఆగిన పంజాబ్‌ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ను 24న న్యూఢిల్లీలో మొదటి నుంచి నిర్వహిస్తారు.    
   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)