Breaking News

KKR Vs RR: ఐపీఎల్‌లో ఇవాళ మరో బిగ్‌ ఫైట్‌.. పరుగుల వరద ఖాయం..!

Published on Tue, 04/16/2024 - 11:46

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఇవాళ (ఏప్రిల్‌ 16) మరో బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. పటిష్టమైన, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్న రాజస్థాన్‌, కేకేఆర్‌ జట్లు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో కత్తులు దూసుకోనున్నాయి. రాత్రి 7:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పరుగుల వరద పారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. ఈడెన్‌ గార్డెన్స్‌ పిచ్‌ బ్యాటర్లకు అనుకూలించనుండటంతో నేటి మ్యాచ్‌లో బ్యాటర్లు చెలరేగే అవకాశం ఉందని అంచనా.

ఈ సీజన్‌లో ఆరు మ్యాచ్‌లో ఐదింట గెలిచిన రాజస్థాన్‌ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. ఐదింట నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచిన కేకేఆర్‌ రెండో స్థానంలో ఉంది. 

హెడ్‌ టు హెడ్‌ రికార్డులను పరిశీలిస్తే.. ఇరు జట్లు గతంలో 27 సార్లు ఎదురెదురుపడగా కేకేఆర్‌ 14, రాయల్స్‌ 13 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి. ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్‌ జరిగినా నెక్‌ టు నెక్‌ ఫైట్‌ ఉంటుంది. ఈడెన్‌ గార్డెన్స్‌ విషయానికొస్తే.. ఈ మైదానంలో రాయల్స్‌పై కేకేఆర్‌దే పైచేయిగా ఉంది. ఇక్కడ ఇరు జట్లు 9 మ్యాచ్‌ల్లో తలపడగా.. కేకేఆర్‌ 6, రాయల్స్‌ 3 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.

ప్రస్తుత సీజన్‌లో ఇరు జట్ల బలాబలాలపై లుక్కేస్తే.. రెండు జట్లు అన్ని విభాగాల్లో సమతూకంగా కనిపిస్తున్నాయి. ఇరు జట్లలో ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని అంచనా వేయడానికి వీల్లేదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో అంత పర్ఫెక్ట్‌గా ఉన్నాయి ఇరు జట్లు. 

కేకేఆర్ బ్యాటింగ్‌లో ఫిలిప్‌ సాల్ట్‌, సునీల్‌ నరైన్‌, రఘువంశీ, శ్రేయస్‌ అయ్యర్‌, రింకూ సింగ్‌, రసెల్‌ లాంటి విధ్వంసకర వీరులు ఉండగా.. రాయల్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో యశస్వి జైస్వాల్‌, జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, రియాన్‌ పరాగ్‌, హెట్‌మైర్‌, రోవ్‌మన్‌ పావెల్‌ లాంటి మెరుపు వీరులు ఉన్నారు. 

బౌలింగ్‌ విభాగం విషయానికొస్తే.. కేకేఆర్‌లో స్టార్క్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా లాంటి స్టార్‌ పేసర్లు ఉండగా.. రాయల్స్‌లో ట్రెంట్‌ బౌల్ట్‌, చహల్‌, అశ్విన్‌ లాంటి మ్యాచ్‌ విన్నర్లు ఉన్నారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో ఇరు జట్లు సమతూకంగా ఉండటంతో నేటి మ్యాచ్‌లో పైచేయి ఎవరిదని చెప్పడం​ చాలా కష్టం.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)