Breaking News

SRH: వావ్‌.. గెలిచాం.. కావ్యా మారన్‌ పక్కన ఎవరీ అమ్మాయి?

Published on Sat, 04/06/2024 - 09:42

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తిరిగి గెలుపుబాట పట్టింది. సొంత మైదానంలో వరుసగా రెండో మ్యాచ్‌ గెలిచి సత్తా చాటింది. కాగా ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ పరాజయంతో ఆరంభించిన విషయం తెలిసిందే.

తొలి మ్యాచ్‌లో ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో ఓడిపోయిన కమిన్స్‌ బృందం.. తర్వాత సొంతగడ్డపై రికార్డు విజయం అందుకుంది. ఉప్పల్‌లో ముంబై ఇండియన్స్‌ను మట్టికరిపించి తొలి గెలుపు నమోదు చేసింది.

అయితే, ఆ తర్వాత అహ్మదాబాద్‌ వెళ్లిన సన్‌రైజర్స్‌కు మళ్లీ భంగపాటు తప్పలేదు. గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఏడు వికెట్ల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది. ఈ క్రమంలో నాలుగో మ్యాచ్‌ కోసం మళ్లీ ఉప్పల్‌కు విచ్చేసిన సన్‌రైజర్స్‌ హోం గ్రౌండ్‌లో తమకు తిరుగు లేదని నిరూపించింది.

తాజాగా చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించి మళ్లీ విన్నింగ్స్‌ ట్రాక్‌ ఎక్కేసింది. ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ సహ యజమాని కావ్యా మారన్‌ సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. చెన్నైపై రైజర్స్‌ విజయం తర్వాత ఆమె ఒక్కసారిగా ఎగిరి గంతేశారు. 

‘‘అవును.. గెలిచాం.. వావ్‌’’ అంటూ చప్పట్లతో కావ్య తన జట్టును అభినందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక చెన్నైతో మ్యాచ్‌లో రైజర్స్‌ ఓపెనర్‌ అభిషేక్‌ శర్మ తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడిన విషయం తెలిసిందే.

మొత్తంగా 12 బంతులు ఎదుర్కొన్న 23 ఏళ్ల ఈ యువ బ్యాటర్‌ 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 37 పరుగులు రాబట్టాడు. తద్వారా రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ నేపథ్యంలో అభిషేక్‌ తల్లి, సోదరి వచ్చి అభిషేక్‌తో ఫొటోలు దిగారు.

ఆ అమ్మాయి ఎవరంటే?
ఇక అభిషేక్‌ శర్మ సోదరి.. విక్టరీ సింబల్‌ చూపిస్తూ కావ్యా మారన్‌తో కూడా ఫొటోలకు ఫోజులివ్వడం విశేషం. కాగా కావ్యా మారన్‌కు  ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐపీఎల్‌ మ్యాచ్‌ అంటే చాలా మందికి ఆమె గుర్తుకువస్తారు. 

స్టాండ్స్‌లో ఉండి సన్‌రైజర్స్‌ను ఉత్సాహపరుస్తూ ఆమె చేసే సందడి అంతా ఇంతా కాదు. కావ్య ఎక్స్‌ప్రెషన్స్‌ ఒడిసిపట్టేందుకు కెమెరామెన్‌ చాలా మటుకు ఆమెపైనే ఫోకస్‌ పెడుతూ ఉంటారని ప్రత్యేకంగా చెప్పాలా?!

చదవండి: జడ్డూ అవుట్‌ కావాలి కదా? కమిన్స్‌ ఎందుకు వదిలేశాడు? వీడియో వైరల్‌

Videos

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)